వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అశాంతి, సీఎం అలావుంటే.. మంత్రులు ఇలా: చంద్రబాబు, పరిటాల శ్రీరామ్‌కు ఆశీస్సులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతి నెలకొందని, ఇందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారే కారణమని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చపెట్టారు..

ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చపెట్టారు..

ప్రశాంతమైన రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని.. ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. ఓటు టోటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా సీఎం జగన్మోహన్ రెడ్డికి విశ్వాసం లేదని ఆరోపించారు.

సీఎం అలా.. మంత్రులు ఇలా..

సీఎం అలా.. మంత్రులు ఇలా..

సీఎం ఏ మతస్థుడైన కావొచ్చని.. కానీ అన్ని మతాలను ఆయన సమదృష్టితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. ఇటీవల మంత్రులు చేసిన వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ తప్పుడు ప్రచారానికి ఇదే రుజు

వైసీపీ తప్పుడు ప్రచారానికి ఇదే రుజు

టీడీపీపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 770 కోట్లు ఖర్చు చేసిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. వైసీపీ తప్పుడు ప్రచారానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని అన్నారు. సాక్ష్యాధారాలు ఉన్నా మంత్రి గుమ్మనూరు జయరాంపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. టీడీపీ నుంచి అధికార పార్టీలోకి వలసలపై మాట్లాడుతూ.. ప్రలోభాలు పెట్టి కొందరిని లాక్కున్నంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి ఒకరు పోతే వందమందిని తయారు చేసే సత్తా టీడీపీకి ఉందని చెప్పుకొచ్చారు. రాజీనామా చేయించాకే పార్టీలోకి తీసుకుంటామన్న జగన్ మాట ఏమైందని చంద్రబాబు నిలదీశారు. గతంలో తనపై 26 విచారణలకు చేయించి ఏదీ రుజువు చేయలేకపోయారని అన్నారు.

పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు ఆశీస్సులు


‘ప్రజలు మీ కుటుంబం మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ.. ప్రజా జీవితంలో ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, నిండు నూరేళ్ళూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పరిటాల శ్రీరామ్‌ను హృదయ పూర్వకంగా ఆశీర్వదిస్తున్నాను' అని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

English summary
chandrababu naidu slams ys jagan for religious attacks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X