అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ హమీలు నెరవేర్చాల్సిందే, కేంద్రం పోరాటమే: బాబు షాకింగ్ కామెంట్స్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కేంద్రంపై పోరాటం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Recommended Video

Andhra Cabinet Meeting : Takes Key Decisions

అనంతపురం జిల్లా పెనుగొండలో కియా కార్ల పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు పాల్గొన్నారు. గత నాలుగేళ్ళుగా ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే ప్రత్యేక హోదాతోనే పారిశ్రామికాభివృద్ది సాధ్యమౌతోందన్నారు చంద్రబాబునాయుడు.

కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలు అమలయ్యే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ రాష్ట్రానికి బడ్జెట్లో నిధుల విషయంలో రాజకీయపార్టీలు కేంద్రంపై పోరాటం చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

కుక్కలాగా తిరిగి బిజెపికి ఓట్లడిగా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: శివాజీ సంచలనం కుక్కలాగా తిరిగి బిజెపికి ఓట్లడిగా, ప్రశ్నిస్తే దాడులు చేస్తారా: శివాజీ సంచలనం

కేంద్రంపై పోరాటం చేస్తాం

కేంద్రంపై పోరాటం చేస్తాం

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలు చేసే వరకు కేంద్రంపై పోరాటం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. అనంతపురంలో బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్యాకేజీకి ఒప్పుకొన్న కారణమదే

ప్యాకేజీకి ఒప్పుకొన్న కారణమదే

ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇస్తామని కేంద్రం చెప్పిందని, అందుకే ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొన్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.విభజన హామీల అమలుకు పోరాటం చేస్తామని బాబు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు.

ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చి దిద్దుతాం

ఏపీని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చి దిద్దుతాం

కియా మోటర్స్ కు హంద్రీ నీవా నీటిని అందించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏడాదికి 10 లక్షల కార్లు ఇక్కడ ఉత్పత్తి కానున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. కియా కార్ల పరిశ్రమతో అనంతపురం దశ మారనుందన్నారు. ఏపీ రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ‌్ గా తీర్చిదిద్దనున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

2021 నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి

2021 నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి

2021 నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నామని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు షార్క్ చెప్పారు. కియో మోటార్స్ సోదర సంస్థ హుందాయ్ ప్లాంట్ ను 1996లో చెన్నైలో ఏర్పాటు చేశామని, ఇప్పుడు, ఏపీలో ఈ సంస్థ యూనిట్ కు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ‘కియా' మోటార్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరవలేనిదని, ప్రజలు, అధికారులు చక్కగా సహకరిస్తున్నారని షార్క్ చెప్పారు.

English summary
Andhra pradesh Chief Minister N Chandrababu Naidu started installation programme of Kia Motors at Yerramanchi village of Penugonda mandal of Anantapur district on Thursday. The Kia Motors is planning to release its first car in March 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X