వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాకు గౌరవం ఇవ్వలేదు, ఉద్ధవ్‌తో మాట్లాడానా: మోడీపై బాబు ఆగ్రహం, ఇంకా ఓపికా.. సుజనకు నిలదీత

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని, ప్రజలు, పార్టీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన టీడీపీ ఎంపీలతో ఆదివారం భేటీ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో యుద్ధానికి సిద్ధం కావాలని ఎంపీలకు ఆయన సూచించారు.

ప్రజాభిప్రాయాన్ని సభలో చెప్పడానికి వెనుకాడవద్దని సూచించారు. ప్రజల అభిప్రాయాలు చెప్పడంలో కఠినంగా ఉండాలని చెప్పారు. సభలో ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సభలో సస్పెండ్ అయినా తగ్గవద్దన్నారు. సంప్రదింపులతో సమస్య పరిష్కారం కావడం లేదని ఈ సందర్భంగా పలువురు ఎంపీలు అన్నారు.

జగన్ ఇంకా నాటకాలు ఆడుతున్నారు

జగన్ ఇంకా నాటకాలు ఆడుతున్నారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ నాటకాలు ఆడుతున్నారని, దీనిని ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన అసలు సమస్య కాదన్నారు. విభజన చట్టంలో పెట్టారు కాబట్టి దానిని అడుగుతున్నామని చెప్పారు. దానిని ప్రధానాంశంగా తీసుకొని మనం పోరాడదవద్దన్నారు. పార్టీలకు అతీతంగా బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్జగన్ దెబ్బ, బాబు డైలమా.. బడ్జెట్‌పై ఇదీ వ్యూహం! అశోక్-సుజనల రాజీనామా, ట్విస్ట్

మిత్రపక్షంగానైనా గౌరవించలేదని ఆవేదన

మిత్రపక్షంగానైనా గౌరవించలేదని ఆవేదన

ఏపీని ప్రత్యేకంగా చూడమని తాను ఢిల్లీలోని ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. కేంద్ర బడ్జెట్ పైన జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రజలు ముక్తకంఠంతో దీనిపై నిరసన చెబుతున్నారన్నారు. ఈ బడ్జెట్‌లో కనీసం మిత్రపక్షంగానైనా గౌరవించలేదనేది తమ ఆవేదన అని ఆయన చెప్పారు. దశల వారీగా కేంద్రంపై పోరాటం చేయాలని తెలిపారు.

బాబుతో టచ్‌లో ఢిల్లీ పెద్దలు: మొదటి అడుగు.. రాజీనామాపై సుజనా ట్విస్ట్బాబుతో టచ్‌లో ఢిల్లీ పెద్దలు: మొదటి అడుగు.. రాజీనామాపై సుజనా ట్విస్ట్

నాలుగు బడ్జెట్‌ల తర్వాత కూడా సహనం ఉంటుందా

నాలుగు బడ్జెట్‌ల తర్వాత కూడా సహనం ఉంటుందా

భేటీ సందర్భంగా కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కను సుజనా చౌదరి చెప్పారు. కేంద్రం వైఖరిపై చంద్రబాబు ఆయనను అడిగి తెలుసుకున్నారు. నాలుగు బడ్జెట్‌లు చూసిన తర్వాత కూడా ఇంకా సహనం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు.. సుజనను ఉద్దేశించి అన్నారు. ఏపీ ప్రస్తావన లేకపోవడం బాధగా ఉందని చెప్పారు.

ఎవరూ చెప్పినా తగ్గొద్దు, మౌనం కుదరదు

ఎవరూ చెప్పినా తగ్గొద్దు, మౌనం కుదరదు

ఎన్నికలే ప్రధానం కాదని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశనం చేశారు. మిగతా రాష్ట్రాలతో సమానంగా వచ్చే నిధులు కాకుండా విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలని పదేపదే కోరానని చెప్పారు. రేపటి నుంచి నిరసనలు, ఆందోళనలు చేపట్టాలన్నారు. ఎవరు చెప్పినా తగ్గవద్దన్నారు. ఇక మౌనంగా ఉండటం కుదరదన్నారు.

ఉద్దవ్ థాకరేతో మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలపై

ఉద్దవ్ థాకరేతో మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలపై


తాను శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అవన్నీ అబద్దపు వార్తలను చెప్పారు. తాను శివసేన అధినేతతో ఫోన్లో మాట్లాడలేదని ఎంపీలకు స్పష్టం చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంటులో పోరాడాలని, ఇది తొలి అడుగు అని చెప్పారు. ఏపీ ప్రయోజనాలు సాధించుకునే వరకు పోరాడుదామన్నారు.

ఎంపీల అభిప్రాయం తీసుకున్న బాబు

ఎంపీల అభిప్రాయం తీసుకున్న బాబు


ఈ సందర్భంగా ఎంపీల అభిప్రాయాలను చంద్రబాబు అడిగారు. దశలవారీగా ఆందోళన చేద్దామని కొందరు, ఇప్పుడే రాజీనామా చేద్దామని మరికొందరు, కేంద్రమంత్రులతో రాజీనామా చేయిద్దామని ఇంకొందరు చెప్పారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, మీరు ఎలా చెబితే అలా చేస్తామని అందరూ చెప్పారు. అయితే జనంలో వ్యతిరేకత ఉందని, మౌనంగా ఉంటే కుదరదని ఎంపీలకు ఆయన సూచించారు.

ఏమీ తేల్చకుండానే!

ఏమీ తేల్చకుండానే!

కాగా, చంద్రబాబు ఆదివారం ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. ఊహించని నిర్ణయం మాత్రం రాలేదు. పార్లమెంటులో మాత్రం ఏపీ ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడాలని, సస్పెండ్ అయినా పర్వాలేదని, తగ్గవద్దని సూచించారు. అంతకుమించిన అనూహ్య నిర్ణయం మాత్రం ఏమీ రాలేదని చెప్పవచ్చు. పొత్తుపై తాడోపేడో అన్నట్లుగా ఎంపీలు మాట్లాడారు. కానీ నిర్ణయానికి వచ్చేసరికి ఆ సీరియస్‌నెస్ కనిపించలేదు.

English summary
AP Chief Minister and Telugu Desam Party president Chandrababu Naidu hold a crucial meeting with party MPs to review the party’s ties with its ally BJP. Chandrababu is upset with the saffron party over poor allocation for the state in the Union Budget 2018 despite repeated appeals for additional funds and incentives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X