అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ నుంచి వస్తారు అంతే, కొట్టుకుంటారా: పార్టీ నేతలపై ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతలకు షాకిచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని స్వాగతించాలని, రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పలువురు నేతలను పార్టీలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన శుక్రవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

Recommended Video

Giddi Eswari Dealing With TDP : Video Evidence Out | Oneindia Telugu

జగన్‌కు షాక్: టీడీపీలో చేరిన గుర్నాథ్ రెడ్డి, ఎవరితో పోరాడాలని ప్రభాకర్ చౌదరి ప్రశ్నజగన్‌కు షాక్: టీడీపీలో చేరిన గుర్నాథ్ రెడ్డి, ఎవరితో పోరాడాలని ప్రభాకర్ చౌదరి ప్రశ్న

ఈ సందర్భంగా మాట్లాడారు. వైసిపి నుంచి వచ్చే వారిని కలుపుకుపోవాలని సూచించారు. లేదంటే బాగుండదని హెచ్చరించారు. పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అందరు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హితవు పలికారు.

రా చూసుకుందాం: సునీత ఎదుటే కుర్చీలతో రెచ్చిన గొట్టిపాటి-కరణం, బాబు సీరియస్రా చూసుకుందాం: సునీత ఎదుటే కుర్చీలతో రెచ్చిన గొట్టిపాటి-కరణం, బాబు సీరియస్

ఎమ్మెల్యేలకు బాబు క్లాస్

ఎమ్మెల్యేలకు బాబు క్లాస్

ఈ సందర్భంగా చంద్రబాబు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ మధ్య గురువారం జరిగిన గొడవపై స్పందించారు. ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకే చేరికలు అని చెప్పారు. వివిధ పార్టీలకు నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు.

రాజకీయ పునరేకీకరణలో భాగంగా

రాజకీయ పునరేకీకరణలో భాగంగా

ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉపయోగించిన మాటను కూడా మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణలో భాగంగా పార్టీలోకి పలువురిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు కూడా అదే విషయం చెప్పారు. రాజకీయ పునరేకీకఱణలో భాగంగా వారిని చేర్చుకుంటున్నామని చెప్పారు.

పార్టీ ఆదేశాల ప్రకారం పని చేయాలి

పార్టీ ఆదేశాల ప్రకారం పని చేయాలి

పార్టీ ఆదేశాల ప్రకారమే అందరూ పని చేయాలని చంద్రబాబు సూచించారు. నియోజకవర్గాలలో నేతల మధ్య గొడవలు జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఒక్క నియోజకవర్గంలో గొడవ జరిగినా పార్టీకి చెడ్డపేరు వస్తుందని చెప్పారు. పార్టీకి చెడ్డపేరు తెస్తే సహించనని చెప్పారు. మరోసారి గొడవలు పడొద్దన్నారు.

ప్రభాకర్ చౌదరి అసంతృప్తి

ప్రభాకర్ చౌదరి అసంతృప్తి


గుర్నాథ్ రెడ్డి చేరికపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. అందరిని కలుపుకొని వెళ్లాలని చెప్పారు.

కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటి నివేదిక

కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటి నివేదిక

ఇదిలా ఉండగా, కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటీ నివేదిక ఇచ్చిందని, కేబినెట్లోకి రాబోతున్నట్లు చంద్రబాబు తెలిపారు. మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలపనున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతిపై కేబినెట్ ఆమోదించినట్లు చంద్రబాబు శనివారం సభలో ప్రకటన చేయనున్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu take class to MLAs and leaders on joinings from YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X