అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కక్ష సాధింపు! హక్కులడిగితే ఐటీ దాడులా?: చంద్రబాబు నిప్పులు, తుఫాను బాధితులకు అండ

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్‌పై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకృతి వల్ల తలెత్తే సమస్యలకంటే.. రాజకీయ కుట్రలే పెద్ద తలనొప్పిగా మారాయని వ్యాఖ్యానించారు.

కేంద్రం అలా.. ఇక్కడి పార్టీ ఇలా..

కేంద్రం అలా.. ఇక్కడి పార్టీ ఇలా..

నీరు-ప్రగతి, వ్వవసాయంపై సీఎం చంద్రబాబు సోమవారం ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన నష్టపోయిన రాష్ట్రాన్ని.. అప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మరో రకంగా వివక్షచూపిస్తోందని ఆరోపించారు. వారితోపాటు రాష్ట్రంలోని పార్టీ సహాయ నిరాకరణతో మరింత అన్యాయం చేస్తోందన్నారు.

హక్కులు డిమాండ్ చేస్తే.. ఐటీ దాడులా?

హక్కులు డిమాండ్ చేస్తే.. ఐటీ దాడులా?

రాష్ట్రానికి ప్రకృతి విపత్తులు సమస్య మారుతుంటే.. వాటిని ఎంతో శ్రమించి అధిగమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మన హక్కులు డిమాండ్ చేస్తే ఐటీ దాడులు చేసే పరిస్థితి నెలకందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని వ్యాఖ్యానించారు. ఐటీ దాడులు చేయడం ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

టిట్లీ బీభత్సం: బాధితుల ఆవేదన ఎవరికీ పట్టదా?, కంటతడి పెడుతున్న శ్రీకాకుళంటిట్లీ బీభత్సం: బాధితుల ఆవేదన ఎవరికీ పట్టదా?, కంటతడి పెడుతున్న శ్రీకాకుళం

కక్ష సాధింపు సరికాదు

సమస్యల పరిష్కారంలో పోటీ పడాలే తప్ప.. కక్ష సాధింపు వైఖరి సరికాదని చంద్రబాబు హితవు పలికారు. న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలని, వంశధార ఎడమ కాలువ గండ్లు పూడ్చే పనులు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

అధికారులకు దిశానిర్దేశం


చెరువుల కట్టలు పటిష్టం చేసే పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. నష్టపోయిన రైతులు పంట బీమా అడుగుతున్నారని, ఆ కంపెనీలతో తక్షణమే చర్చించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట బీమా ప్రయోజనం బాధిత రైతాంగానికి అందించాలని, ఇప్పటికే 35వేల హెక్టార్లలో ఎన్యూమరేషన్ పూర్తిచేశారన్నారు. మిగిలిన లక్ష హెక్టార్లలో పంటనష్టం అంచనా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఇళ్లు కూలిన బాధితులకు రూ.1.50లక్షలు

అదనపు సిబ్బందిని, అధికారులను రప్పించుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని సూచించారు. మంగళవారం పు తాను శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికల్లా పరిస్థితులు పూర్తిగా మెరుగుపడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశంచేశారు. కాగా, తుఫాను ప్రభావంతో ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు, పూర్తిగా ఇళ్లు దెబ్బతిన్నవారికి ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50లక్షల విలువైన ఇల్లు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయాన్ని ప్రకటించింది.

English summary
Andhra Pradesh CM and TDP president Chandrababu Naidu on Monday takes on Centre and YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X