నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2019లో అలా చేయడమే నా లక్ష్యం: జగన్‌పై బాబు నిప్పులు, నంద్యాలపై దృష్టి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించారని చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం బహిరంగ సభలో మాట్లాడారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

YSRCP struggling to break the Defeat image అందుకోసం జగన్ వెయిటింగ్! | Oneindia Telugu

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించారని చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు.

కాంగ్రెస్‌ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకున్నాయని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్‌ కూడా దక్కకుండా చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు.

చదవండి: ఇల్లు, ఆఫీస్ ఒకేచోట: లోటస్‌పాండ్‌లా అమరావతిలోను వైసిపి ఆఫీస్

నంద్యాలను స్మార్ట్ చేస్తాం

నంద్యాలను స్మార్ట్ చేస్తాం

నంద్యాలను స్మార్ట్ సిటీగా చేస్తామన్నారు. ప్రతిపక్ష వైసిపికి దశ, దిశ లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా తయారు చేస్తామన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

ఆ బాధ్యత నాది

ఆ బాధ్యత నాది

ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చే బాధ్యత తనదని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యక్రమం చేపడుతున్నామని చంద్రబాబు అన్నారు. టిడిపి హయాంలోనే అభివృద్ధి అన్నారు.

నంద్యాలపై బాబు ప్రత్యేక దృష్టి

నంద్యాలపై బాబు ప్రత్యేక దృష్టి

నంద్యాల ఉప ఎన్నికల సమయంలో టిడిపి పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నంద్యాలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదిశగా నేతలను ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.

అక్రమాలతో గెలిచారని ప్రతిపక్షాలు

అక్రమాలతో గెలిచారని ప్రతిపక్షాలు

అభివృద్ధి తమను గెలిపించిందనిటిడిపి చెబుతుండగా, టిడిపి అక్రమాలు, అవినీతితో గెలిచిందని వైసిపి, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సోమవారం మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. టిడిపి భారీ అక్రమాలకు పాల్పడిందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu toured in Nandyal after Telugu Desam Party winning in bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X