వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంటిది!: బడ్జెట్‌పై బాబు తీవ్ర అసంతృప్తి, త్యాగానికి సిద్ధమని సుజనా, 'చాలా దుర్మార్గం'

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం చంద్రబాబు ఎంపీలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Recommended Video

Union Budget 2018 : Telugu States In Shock With Jaitley's Budget 2018 | Oneindia Telugu

ఈ సందర్భంగా బడ్జెట్ పైన చర్చించారు. ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజనతో కొత్తగా ఏర్పడిన ఏపీకి ఈ బడ్జెట్‌లో ఏమాత్రం న్యాయం జరగలేదని చంద్రబాబు నేతల వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

బడ్జెట్ స్పీచ్ వేరు, పొందుపర్చిన అంశాలు వేరు: యనమల ట్విస్ట్బడ్జెట్ స్పీచ్ వేరు, పొందుపర్చిన అంశాలు వేరు: యనమల ట్విస్ట్

కేంద్రం ముందు చెప్పండని ఎంపీలకు

కేంద్రం ముందు చెప్పండని ఎంపీలకు

మనం ప్రతిపాదించిన డిమాండ్లను వారు పరిగణలోకి తీసుకోలేదని వారితో చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. విశాఖ రైల్వే జోన్, అమరావతికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు అంశాలలో ఊరట లభించలేదని ఆయన అన్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి జరిగిన న్యాయంపై కేంద్రం ముందు ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

ఏపీకి న్యాయం జరిగే వరకు ఒత్తిడి

ఏపీకి న్యాయం జరిగే వరకు ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. ఏపీకి న్యాయం జరిగే విషయంలో ఏమాత్రం తగ్గవద్దని ఆయన వారికి సూచించారు.

ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సుజనా చౌదరి

ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని సుజనా చౌదరి

బడ్జెట్ విషయమై కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి కూడా స్పందించారు. బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం మా ప్రయత్నాలు మేం చేస్తామని చెప్పారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉందన్నారు. తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చెప్పారు.

దుర్మార్గమని మండిపాటు

దుర్మార్గమని మండిపాటు

బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని సిపీఐ నేత రామకృష్ణ అన్నారు. కేంద్రం మరోసారి మొండిచేయి చూపించిందన్నారు. విభజన హామీల అమలుకు నిధులు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమన్నారు. బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపించాడన్ని నిరసిస్తూ ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు.

అధ్యయనం చేయాలి

అధ్యయనం చేయాలి


బడ్జెట్‌ను పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఏపీకి సంబంధించిన అంశాలు బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు.
విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలుపై బడ్జెట్‌లో ఉందో లేదో చూడాలని చెప్పారు. కర్నాటక ఎన్నికల వల్లే బెంగళూరుకు మెట్రో అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. ప్రతి స్కీమ్ చదివితే చదివితే రాష్ట్రానికి ఏమి ఉన్నాయో, ఏం లేవో తెలుస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ స్పీచ్ వేరు, అందులో పొందుపర్చిన అంశాలు వేరని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తే కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ అన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu unhappy with Union Budget 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X