వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీరు మారకపోతే సిట్టింగ్‌ల సీట్లు గల్లంతు: బాబు సీరియస్ వార్నింగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్టీ నేతల పనితీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనితీరును మార్చుకోకపోతే తాను కొత్తవారిని చూసుకోవాల్సి వస్తోందని బాబు హెచ్చరించారు.సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతేనని బాబు తీవ్రంగానే పార్టీ నేతలకు తేల్చి చెప్పారు.

షాక్: ఆ 40 స్థానాల్లో పార్టీ బలహీనం, తీరు మార్చుకోకపోతే మార్చేస్తా: బాబు సంచలనంషాక్: ఆ 40 స్థానాల్లో పార్టీ బలహీనం, తీరు మార్చుకోకపోతే మార్చేస్తా: బాబు సంచలనం

ఏపీ రాష్ట్రంలో పార్టీ పనితీరుపై పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. కొందరు నేతల పార్టీ తీరును మార్చుకోవడం లేదని చంద్రబాబునాయుడు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల నాటికి పార్టీని సమాయాత్తం చేస్తున్నారు చంద్రబాబునాయుడు. అయితే పార్టీ నాయకులు మాత్రం సక్రమంగా పార్టీ వ్యవహరాలను పట్టించుకోకపోవడంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని చంద్రబాబునాయుడు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నేతల శిక్షణ శిభిరంలో నేతల తీరుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు

సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతే

సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతే

ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ పనితీరును మార్చుకోవాలని మరోసారి హెచ్చరించారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్‌లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వబోనని చంద్రబాబు స్పష్టం చేశారు.ఎన్నికలకు ఏడాది గడువు మాత్రమే ఉంది. అయితే ఈ గడువు సమీపిస్తున్నా కానీ, కొందరు నేతల తీరులో మార్పు రాకపోవడంతో చంద్రబాబు పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు.

జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల పనితీరు మారాలి

జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీల పనితీరు మారాలి

జిల్లా అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాల ఇంఛార్జీల పనితీరు మార్చుకోవాలని చంద్రబాబునాయుడు సూచించారు. వీరి పనితీరుపై బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇంచార్జీల పనితీరును బాబు పార్టీ నేతల వద్ద ప్రస్తావించారని సమాచారం.

తెలుగు మహసభలకు ఆహ్వనం లేకపోయినా నష్టం లేదు

తెలుగు మహసభలకు ఆహ్వనం లేకపోయినా నష్టం లేదు


ప్రపంచ తెలుగు మహసభలకు ఆహ్వనం లేకపోయినా ఫర్వాలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఎస్సీ టీడీపీ నేతల శిక్షణా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను అందరూ గౌరవించాలలని, తెలుగు ప్రపంచ మహాసభలకు టీడీపీ సంఘీభావం తెలియచేస్తుందన్నారు.

తెలుగు వారంతా కలిసే ఉండాలి

తెలుగు వారంతా కలిసే ఉండాలి


తెలుగు భాష కోసం ఎటువంటి కార్యక్రమాలు జరిగినా టీడీపీ మద్దతిస్తుందని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారంతా ఎక్కడ ఉన్నా కలిసి ఉండాలనేదే తమ ఆకాంక్ష అని తెలిపారు. దళితుల సంక్షేమం కోసం ముందడుగు లాంటి ప్రత్యే కార్యక్రమాలు చేపతున్నామన్నారు. దళితుల్లోని అన్ని వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

English summary
Ap Cm Chandrababu naidu warned to party leaders on Friday at Amaravathi.if party leaders not changed their attitude, party will be replaced others
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X