వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

''ఆ హమీ ఇచ్చిన మరునాడే వైఎస్ చనిపోయారు, పరిటాలతో గొడవలు లేవు''

వైఎస్‌ఆర్ మంత్రివర్గంలోకి తీసుకొంటానని చెప్పిన మరునాడే చనిపోయారన్నారు జెసి దివాకర్‌రెడ్డి పరిటాల రవితో గొడవలు లేవు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికైన సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ నేతల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు తనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు. అయితే వైఎస్ చనిపోవడానికి ముందురోజు తనను పిలిచి మంత్రివర్గంలోకి తీసుకొంటానని హమీ ఇచ్చాడని గుర్తుచేసుకొన్నారు. జగన్‌‌‌కు అహంకారమెక్కువ, అందుకే ఆ పార్టీలో చేరాలని ఆహ్వనం వచ్చినా చేరలేదన్నారు జెసి దివాకర్‌రెడ్డి, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడన్నారు జెసి దివాకర్‌రెడ్డి.

సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపి‌లో చేరారు జెసి దివాకర్‌రెడ్డి, అనంతపురం నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్‌పై జెసి దివాకర్‌రెడ్డి ఒంటికాలిపై విమర్శలు గుప్పిస్తుంటారు.

కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరడానికి దారితీసిన పరిస్థితులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వనం వచ్చినా ఎందుకు వెళ్ళలేకపోయారనే విషయమై జెసి దివాకర్ రెడ్డి వివరించారు.

ఓ తెలుగు న్యూస్‌ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల జెసి దివాకర్‌రెడ్డి తన అభిప్రాయాలను కుండబద్దలుకొట్టారు. వైఎస్ఆర్‌తో ఎందుకు వైరం ఏర్పడింది. రెండవ దఫా మంత్రివర్గంలో ఎందుకు చోటు దక్కలేదనే విషయాలపై ఆయన ఈ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

మంత్రి పదవి అందుకే దక్కలేదు

మంత్రి పదవి అందుకే దక్కలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన క్యాబినెట్లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలను స్వీకరించాను.అయితే రాజశేఖర్‌రెడ్డి వ్యవహరశైలిపై తప్పుబట్టినట్టు జెసి దివాకర్‌రెడ్డి గుర్తుచేసుకొన్నారు. రాజశేఖర్‌ రెడ్డి ఎక్కువ తప్పులు చేశాడని నా అనుమానం. పార్టీ కోసమో సొంతానికో ఏదైనా కావచ్చు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒకటి రెండుసార్లు స్పష్టంగా చెప్పాను. ‘మీ పద్ధతి మంచిగా లేదు. కొంత అవసరం మనకి. ఇదేం సత్య కాలం కాదు. కానీ ఇంత అవసరం లేదు' అని చెప్పా. అయితే రెండో దఫా వైఎస్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత మంత్రవర్గంలో చోటు దక్కలేదన్నారు.

చనిపోవడానికి ముందురోజే వైఎస్ హమీ

చనిపోవడానికి ముందురోజే వైఎస్ హమీ

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోవడానికి ఒక్కరోజు ముందే మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదో తెలుసుకొందామని వెళ్లినట్టు జెసి దివాకర్‌రెడ్డి చెప్పారు.
మంత్రి పదవి ఇవ్వకపోవడానికి మీ జిల్లా వాళ్లే కారణమంటూ కొన్ని ఫిర్యాదులు నాకు చూపించాడు. వాటిని చూసి ఆయనకు అన్నీ వివరించా. వైఎస్‌ సంతృప్తి చెందారు. న్యాయం చేస్తా అని చెప్పారు.వైఎస్ఆర్ చనిపోవడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు... నన్ను పిలిపించుకున్నారు. ‘నేను మేడంను ఒప్పించాను. మిమ్మల్ని కేబినెట్‌లోకి తీసుకుంటున్నాను. నేను చిత్తూరు పోతున్నా. రాగానే మంచి రోజు చూసుకుని నిన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటా' అని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆయన వెళ్లిపోయారు.

జగన్ సిఎం కాలేడు

జగన్ సిఎం కాలేడు

పార్టీ పెట్టిన తొలి ఎన్నికల్లోనే అధికారంలోకి రావాలి. ఆ తర్వాత వచ్చే అవకాశం లేదని దేశ రాజకీయాలను చూస్తే తెలుస్తుంది. ఆ అదృష్టాన్ని జగన్‌ కాలదనుకున్నాడు. కేవలం పొగరుబోతుతనమే దీనికి కారణం. వాళ్ల నాయనకు చాలామంది సన్నిహితులు ఉన్నారు. జగన్‌ తెలివైన వాడై ఉంటే... స్వయంగా వెళ్లి వాళ్లందరినీ అడిగితే అందరూ చేరేవారు. ఉప ఎన్నికల్లో 32 సీట్లలో గెలిచానన్న అహంకారంతోనే మొత్తం కాలదన్నుకున్నాడు. ఆ గెలుపు వైఎస్‌ మరణంతో, సానుభూతి వల్లనే లభించింది. ఆ విషయం మర్చిపోయి సొంత బలం అనుకుని ఆహంకారంతో వెళ్లాడు.ఇక జగన్ సీఎం కాలేడన్నారు జెసి దివాకర్‌రెడ్డి.

మా అబ్బాయి టిడిపిలోనే ఉంటాడు

మా అబ్బాయి టిడిపిలోనే ఉంటాడు

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన సమయంలో వైఎస్‌జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలంటూ సంతకాల సేకరణ చేశారు. అయితే తాను ఆ సమయంలో సంతకం చేయలేదన్నారు జెసి దివాకర్‌రెడ్డి. కానీ, కొన్ని రోజుల తర్వాత వాళ్లంతా వస్తే నలుగురితో పాటు సంతకం చేశానని చెప్పారు జెసి దివాకర్‌రెడ్డి. పార్టీలోకి రావాలని విజయ సాయిరెడ్డి తదితరులు రాయబారానికి వచ్చారు. కానీ, జగన్ వైఖరి కారణంగానే నేను పార్టీలో చేరలేదన్నారు జెసి దివాకర్‌రెడ్డి. జగన్, తన కొడుకు పవన్ క్లాస్‌మేట్స్. మంచి మిత్రులు. అయితే తన కొడుకు టిడిపిలోనే ఉంటాడని చెప్పగలనని చెప్పారు. జగన్‌తో వ్యక్తిగత స్నేహం వేరు. పార్టీలు వేరని జెసి అభిప్రాయపడ్డారు.

2019లో చంద్రబాబే సీఎం

2019లో చంద్రబాబే సీఎం

2019లో చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అనంతపురం జెసి దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబును ఎదుర్కొనే నేత రాష్ట్రంలో ఎవరూ లేరు. నిన్న జరిగిన నంద్యాల ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లంతా చంద్రబాబుకే ఓటు వేస్తున్నట్లు ఫీలయ్యారు. రాజకీయం అంటే నమ్మకం... విశ్వాసం. వ్యక్తిగతంగా జగన్‌ ఆ విశ్వాసాన్ని సంపాదించుకోలేదు. చంద్రబాబు సంపాదించుకున్నాడు. ఆ విశ్వాసం ప్రజల్లో పొందడం వల్లనే మహా నాయకుడు ఎన్టీఆర్‌ తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయి. కాంగ్రెస్‌ ఇక మిగలదు. చంద్రబాబు మనల్ని చేర్చుకోడు అనుకున్న వాళ్లంతా బీజేపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబరులో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు.

పరిటాలతో గొడవలు లేవు

పరిటాలతో గొడవలు లేవు

అసలు వివాదాలే లేవు. ఆయన ఎప్పుడూ నా నియోజకవర్గంలోకి రాలేదు. నేనూ పోలేదన్నారు. అయితే పరిటాల రవి హత్య తర్వాత అదృశ్యం కావడంపై కూడ ఆయన వివరణ ఇచ్చారు.. నేను మంత్రిగా నీటి విషయం గురించి కర్ణాటక ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లా.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే నా మీద చాలా విచారణలు జరిపారు. ఎవరైనా నన్ను నమ్ముకున్న వారు తప్పులు చేసి వస్తే కాపాడిన మాట వాస్తవం. అప్పటికీ వాళ్లు చేసిన తప్పులను తప్పు అని చెప్పా. నేనుగా ఎప్పుడూ వాడిని చంపిరా... కొట్టి రా అని ఈ నోటితో చెప్పలేదు.

English summary
Chandrababu Naidu will re elected as Cm In 2019 election said Anantapur MP JC Diwakar reddy.Iam differed with former Cm Ys Rajashekar reddy in 2004-2009 he said.Telugu News channel interviewed Jc Diwakar reddy on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X