మీతో కలిసి ఉండంలో అర్థంలేదు: అమిత్ షాకు బాబు లేఖ, కారణాలు చెప్పిన సీఎం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవాల్సిన కారణాలను వివరించారు.
ఎన్డీయే నుంచి బయటకు రావాలన్న తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయాన్ని వెల్లడించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయేతో జతకట్టామన్నారు.
అవి నెరవేరక పోవడం వల్ల ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు.

ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చనందున ఇంకా ఎన్డీయేలో కొనసాగడం సరికాదన్నారు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.
బీజేపీతో పొత్తు ద్వారా తాము ప్రజలకు చేయాల్సింది చేయలేకపోతున్నామని, అలాంటప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిణామాలను కూడా వివరించారు. బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరలేదన్నారు.












Click it and Unblock the Notifications