వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాదం: చెప్పులతో నారా లోకేష్, సగమే మునిగిన చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యవహరించిన తీరు వివాదంగా మారింది. విజయవాడ దుర్గా ఘాట్ వద్ద చంద్రబాబు కుటుంబ సభ్యులు శుక్రవారం స్నానమాచరించిన విషయం తెలిసిందే. కృష్ణా నదికి పూజలు కూడా చేశారు.

పుష్కర ప్రారంభ కార్యక్రమంలో నారా లోకేష్ చెప్పులు ధరించి కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, చంద్రబాబు నాయుడు కృష్ణా నదీ జలాల్లో నిండా మునగలేదని, సగమే మునిగారని అంటున్నారు. హరతి సమయంలో నారా లోకేష్ చెప్పులు తొడుక్కుని కూర్చున్నారు. దీనిపై వివాదం చెలరేగుతోంది.

Photos: కృష్ణ పుష్కరాల్లో చంద్రబాబు

Chandrababu and Nara Lokesh dipping creates controversy

కృష్ణా పుష్కరాలపై దర్శకుడు బోయపాటి డైరెక్షన్‌లో షార్ట్‌ ఫిల్మ్ కూడా చిత్రీకరిస్తున్నారు. కృష్ణా నదిలో పుష్కరాల సందర్బంగా వేలాది మంది భక్తులు స్నానమాచరిస్తున్నారు. ఈ పుష్కరాలు 12 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. పుష్కరం అంటే పన్నెండేల్లు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలంపూర్ సమీపంలో పుష్కర స్నానమాచరించారు. చంద్రబాబు విజయవాడ వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Controversy erupted on Andhra Pradesh CM Nara Chandrababu Naidu and his son Nara Lokesh attitude during Krishna Pushkaralu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X