వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది..ఇది తుగ్లక్ చర్య .. చంద్రబాబు ,లోకేష్ ఆవేదన

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు నేపధ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని, పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుండి రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ రాజధాని ప్రాంత రైతులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి నాటి వైభవం .. నేటి దుస్థితి .. శంకుస్థాపన ప్రాంతంలో రాజధాని రైతుల ఆందోళనఅమరావతి నాటి వైభవం .. నేటి దుస్థితి .. శంకుస్థాపన ప్రాంతంలో రాజధాని రైతుల ఆందోళన

ఐదేళ్ళ క్రితం ఇదే రోజు శంకుస్థాపన .. గుర్తు చేసుకున్న చంద్రబాబు

ఐదేళ్ళ క్రితం ఇదే రోజు శంకుస్థాపన .. గుర్తు చేసుకున్న చంద్రబాబు

నేడు రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదు సంవత్సరాలయింది. ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఏపీ రాజధాని అమరావతికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగింది. ప్రపంచ స్థాయిలో రాజధానిని గుర్తించే విధంగా అత్యద్భుతంగా అమరావతి నిర్మిస్తామని అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని పరిస్థితి గందరగోళంగా మారింది. రాజధాని అమరావతి కోసం ఏపీలో యుద్ధమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం ఇదే రోజున విజయదశమి రోజున రాజధాని అమరావతి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు రాజధాని అమరావతి పై తన ఆవేదనను వ్యక్తం చేశారు.

రాజధాని నిర్మాణ పనులను గుర్తు చేసుకుని ఆవేదన చెందిన చంద్రబాబు

రాజధాని నిర్మాణ పనులను గుర్తు చేసుకుని ఆవేదన చెందిన చంద్రబాబు

విభజన నష్టాలను అధిగమించి, 13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువతకు ఉద్యోగ అవకాశాలు కార్యస్థానంగా, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదు సంవత్సరాలు అంటూ చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేసారు అంటూ పేర్కొన్నారు.
అంతేకాదు వేలాది కూలీలు, భారీ మిషనరీ తో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోంది అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నీరు కార్చడం ప్రజాద్రోహం.. తుగ్లక్ చర్య

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నీరు కార్చడం ప్రజాద్రోహం.. తుగ్లక్ చర్య

పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నీరు కార్చడం ప్రజాద్రోహం అంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. నాడు శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని దేశ , విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాల రాశారు అంటూ నిప్పులు చెరిగారు చంద్రబాబు. అవాస్తవ ఆరోపణలతో, అభూత కల్పనలతో అమరావతి పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తి పైనో , పార్టీ పైనో కక్షతో చట్ట విరుద్ధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణ బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

 రాజధానిని కాపాడుకోవటం ఏపీ పౌరుల కర్తవ్యం అన్న చంద్రబాబు

రాజధానిని కాపాడుకోవటం ఏపీ పౌరుల కర్తవ్యం అన్న చంద్రబాబు

భావితరాల అవసరాలకు అనుగుణంగా భారత దేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపకల్పన చేయబడి 13 వేల గ్రామాల్లో 3000 వార్డుల నుండి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకం చేసి శక్తి సంపన్నం చేసిన మన రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క పౌరుడి కర్తవ్యం అంటూ చంద్రబాబు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పై ఐదేళ్ల క్రితం నేటి శంకుస్థాపన దినాన్ని గుర్తుచేసుకుంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Recommended Video

#Watch AP CM YS Jagan's Lotus Pond ముట్టడి, Bajrang Dal Activists నిరసనలు....!! || Oneindia Telugu
 జగన్ వి విధ్వంసకర ఆలోచనలు లోకేష్ ఫైర్

జగన్ వి విధ్వంసకర ఆలోచనలు లోకేష్ ఫైర్

విభజనతో అన్యాయమై పోయిన ఆంధ్రులు దేశం గర్వపడే స్థాయిలో ఒక రాజధానిని కట్టుకుంటున్నారని చెప్పి ,దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందిస్తే నాటి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చొని విధ్వంసకర ఆలోచనలు చేశారు అంటూ నారా లోకేష్ విమర్శించారు. ఐదేళ్ల క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈరోజు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉండేది . కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి తమ 'విషపునీయత'చూపించుకున్నారు అంటూ నారా లోకేష్ పేర్కొన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

English summary
Recalling the laying of the foundation stone of the capital Amravati on the same day five years ago, Chandrababu Naidu and Nara Lokesh expressed their displeasure over the capital Amaravati current position. Expressing concern over the stagnant and dull view of Amravati, Chandrababu CM Jagan described the decision of the three capitals as a Tughlaq action. Chandrababu and Nara Lokesh called on the people of Andhra Pradesh to protect the capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X