వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు మారడంతే... బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా ? : విజయసాయి ఫైర్

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు . ఏపీలో లిక్కర్ షాపులు తెరవతంతో జనాలు ఎగబడుతున్న తీరుపై టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తుంది. లాక్ డౌన్ ముగిసే వరకు వైన్స్ షాపులు క్లోజ్ చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నాయకులు. ఇక ఈ క్రమంలో చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . గతంలో పది ఇళ్లకు ఒక బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని , చంద్రబాబు హయాంలో బెల్టు షాపుల నిర్వహణ గురించి ప్రస్తావించి మరీ తిట్టిపోశారు విజయసాయి రెడ్డి .

ఏపీలో మద్యం ధరలు పెంచటానికి రీజన్ చెప్పిన సీఎం జగన్ .. ఏం చెప్పారంటేఏపీలో మద్యం ధరలు పెంచటానికి రీజన్ చెప్పిన సీఎం జగన్ .. ఏం చెప్పారంటే

వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి వచ్చాక బెల్టు షాపులే లేకుండా చేశారని, వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని పేర్కొన్నారు. ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేదాన్ని ఎత్తేసిన వ్యక్తి ఇప్పుడు గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. ఇక అంతేకాదు రెండు నాలుకల్లో ఏది,ఎప్పుడు,ఏలైన్ తీసుకుంటుందో ఊహించడం కష్టం అని పేర్కొన్న విజయసాయి వైసీపీ ప్రభుత్వం మద్య నియంత్రణా చర్యలు చేపడితే కష్టజీవులకు ఉపశమనం లేకుండా మద్య నియంత్రణ ఏంటి? షాపులెలా తగ్గిస్తారని నిన్నటికి నిన్న కిందపడి దొర్లాడు చంద్రబాబు నాయుడు .

Chandrababu never changed .. ycp mp Vijayasai reddy fire

సైకిల్ నేతలను దెబ్బకొట్టడానికే ఇదంతా అన్నాడు. ఇప్పుడు కేంద్రం నిర్ణయానికి రాష్ట్రాన్ని నిందిస్తున్నాడు.మనిషి మారడంతే అంటూ విజయసాయి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు . ఇక ఉప్పల్ హెరిటేజ్‌లో నలుగురికి కరోనా వచ్చిందని సోషల్ మీడియా వేదికగా చెప్పిన విజయసాయి వారి వల్ల 25 మంది క్వారంటైన్‌ అయ్యారని పేర్కొన్నారు . వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? అంటూ ప్రశ్నించారు .బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏ చిన్న అవకాశం దొరికినా అటు టీడీపీ , ఇటు వైసీపీ నేతల మాటల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

English summary
YS Jagan Mohan Reddy has controlled the liquor shops after the arrival, the belt shops has been left without shops and the reduction in the number of wine shops has caused some anxiety among the public. Chandrababu is the person who lifted the ban on liquor is now criticising the government . The Vijayasai stated that chandrababu never changes his attitude . he is talking with two tongues nature .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X