వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు వాయిదా వేస్తే ఎవరికి నష్టమో చంద్రబాబు ,నిమ్మగడ్డ చెప్పాలి : మంత్రి కొడాలి నానీ

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికలు ముఖ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ముఖ్యం కాదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోర్టులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు , నిమ్మగడ్డ రమేష్ లకు అనవసరపు హడావుడి దేనికి అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులు సిద్ధంగా లేరని కొడాలి నాని స్పష్టం చేశారు.

లోకేష్ ఓ వేస్ట్‌ ఫెలో... దేవినేని ఉమా .. గన్ తో కాల్చుకో : మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలులోకేష్ ఓ వేస్ట్‌ ఫెలో... దేవినేని ఉమా .. గన్ తో కాల్చుకో : మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు

 ఎన్నికలు జరగకుంటే ఏమి ఇబ్బంది లేదన్న కొడాలి నానీ

ఎన్నికలు జరగకుంటే ఏమి ఇబ్బంది లేదన్న కొడాలి నానీ

కృష్ణాజిల్లా గుడివాడ లో మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ప్రస్తుతం ఎన్నికలు జరగకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేకాధికారుల పాలన సాగుతోందని ఎన్నికలు జరగకపోయినా ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని కొడాలి నాని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు వాయిదా వేస్తే ఎవరికి నష్టం అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు.

కరోనా సెకండ్ వేవ్ .. ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సే ముఖ్యం

కరోనా సెకండ్ వేవ్ .. ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సే ముఖ్యం

ఇంతకుముందు కూడా కొడాలి నాని కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని, ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను చెప్పిందే వేదమని ఏ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్న కొడాలి నాని నిమ్మగడ్డ ఇంకో ఆరు నెలలు మాత్రమే పదవిలో ఉంటారని ఆ తర్వాత ఇంట్లో ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని సంప్రదించాలని, కోర్టులను కాదంటూ కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎవరు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదని ప్రజారోగ్యం దృష్ట్యా ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని కొడాలి నాని కుండబద్దలు కొట్టారు.

ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు వద్దని క్లియర్ గా ఉంది

ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు వద్దని క్లియర్ గా ఉంది

తాజాగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో స్కూల్స్ పునః ప్రారంభించడం పై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కొడాలి నాని సమాధానం చెప్పారు .ఒకవేళ స్కూల్స్ తెరవకపోతే పిల్లలు విద్యాసంవత్సరం కోల్పోతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వద్దని క్లియర్ గా ఉందని , నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమకు స్పష్టత ఇవ్వాలంటూ కొడాలి నాని కోరారు. ఎన్నికలా ... ఎవరికోసం అంటూ కొడాలి నాని వ్యంగంగా మాట్లాడారు.

English summary
Speaking to media in Krishna district Gudivada, Kodali Nani said there was no problem with the non-holding of elections at present. Kodali Nani says that the rule of privileges is going on in the background of the corona and the central government is giving the funds that should be given even if the elections are not held. Kodali Nani asked TDP chief Chandrababu and state election commissioner Nimmagadda Ramesh to say what is the loss if the polls were postponed now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X