వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి ఆఫర్: బాబు ప్లాన్, ఎపికి ప్రత్యేక హోదాపై జైరాం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించే విషయమై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బిజెపికి ఆఫర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌‍లో తమ పార్టీకి వచ్చే రాజ్యసభ స్థానాన్ని బిజెపికి ఇచ్చేందుకు సిద్ధమని ఆఫర్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంలో త్వరలో విస్తరణ జరగనుందని, అందులో మరో రెండు మూడు పదవులు వస్తాయని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే ఎపి అభివృద్ధికి కేంద్రం సహకారం కోరుతున్నారు. ఎన్డీయే నేతలతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని పార్టీ ఎంపీలకు బాబు సూచించారు.

Chandrababu offer to BJP

మంగళవారం టిడిపిపి సమావేశమైంది. ఈ సమావేశంలో లోకసభ నేతను ఎన్నుకోవాలనుకున్నారు. అయితే ఎంపీలు అందరు లోకసభలో నేతను ఎన్నుకునే బాధ్యతను చంద్రబాబుకే కట్టబెట్టారు. చంద్రబాబు ఎవరి పేరు చెబితే వారిని తామంతా సమర్థిస్తామని ఎంపీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిద్దామన్నారు. కాగా పార్లమెంటరీ నేతను మంగళవారం సాయంత్రం ఖరారు చేసే అవకాశముంది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటిని ఎంపిక చేయనున్నారు.

ఎపికి ప్రత్యేక హోదాపై సస్పెన్స్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై గత మంత్రివర్గం ప్రణాళిక సంఘానికి సిఫార్సు చేసిందని కేంద్రమాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 8వ తేదీలోగా విడుదల చేయాల్సి ఉందని జైరాం అన్నారు. కేంద్రం ఆ లోగా విడుదల చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, నాటి కేంద్ర కేబినెట్ మార్చి 2న ఎపి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకుంది.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu offer to BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X