వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఆవిర్భావం రోజునే దీక్ష, నిందించేందుకు కాదు: బాబు

చరిత్ర ఉన్నంతవరకు జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష జరుపుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన ఉదయం పదకొండున్నర గంటలకు మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో భేటీ అయ్యారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చరిత్ర ఉన్నంతవరకు జూన్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష జరుపుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ఆయన ఉదయం పదకొండున్నర గంటలకు మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. చరిత్ర ఉన్నంత వరకూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2నే నవనిర్మాణ దీక్ష జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. నవనిర్మాణ దీక్ష నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష జరుపుకోవాలన్నారు.

నిందించాలని కాదు..

నిందించాలని కాదు..

ఇది ఎవరినో నిందించేందుకు మాత్రం కాదని తేల్చి చంద్రబాబు చెప్పారు. అదే విధంగా 8న మహా సంకల్పం చెప్పుకోవాలని, గడచిన మూడేళ్లలో సాధించిన ప్రగతిపై 3 నుంచి చర్చలు జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఆదాయం తక్కువగా ఉంది

ఆదాయం తక్కువగా ఉంది

ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాదిలో సగటు ఆదాయం తక్కువగా ఉండటానికి కారణం ఎవరన్న విషయం ఆలోచించాలని, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సింది మంత్రులు, పార్టీ నేతలేనని అన్నారు.

అవమానం దిగమింగాలి

అవమానం దిగమింగాలి

విభజన అవమానాన్ని దిగమింగాలని చంద్రబాబు హితవు పలికారు. కసిని, కోపాన్ని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. శని, ఆదివారాలు యంత్రాంగం తప్పనిసరి విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.

గోపాలకృష్ణకు అభినందన

గోపాలకృష్ణకు అభినందన

అధికారులు వినూత్నంగా ఆలోచించి, మూస ధోరణిని విడనాడాలని, అప్పుడే ప్రగతి సాధ్యపడుతుందని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా సివిల్స్ పరీక్షల్లో థర్డ్ ర్యాంకు సాధించిన శ్రీకాకుళం జిల్లా వాసి గోపాలకృష్ణకు ఆయన అభినందించారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Nava Nirmana deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X