వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు వచ్చి కలువు.. ఆ వివాదంపై మాట్లాడాలి: చింతమనేనికి సీఎం కబురు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేసి.. అడ్డుకోబోయిన ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని సీఎం చంద్రబాబు తప్పు పట్టారు. ఈ ఘటనపై గురువారం ఉదయం తనను కలిసి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

ఇలాంటి పనుల వల్ల పార్టీకి చెడ్డ పేరు తప్పే ఒరిగేదేమి లేదని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఇటీవల చింతమనేనిపై ఫిర్యాదులు ఎక్కువవుతున్న క్రమంలో.. మరోసారి సీఎం ఆయన్ను మందలించనున్నారని చెబుతున్నారు.

CM

కాగా ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్లారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.

అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లో సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు.వెంటనే బస్సును అడ్డగించి డ్రైవర్, కండక్టర్‌‌పై విరుచకుపడ్డారు. అంతేకాదు స్థానిక వ్యక్తిపై కూడా దాడి చేశారు.

English summary
AP CM Chandrababu Naidu ordered MLA Chintamaneni Prabhakar to meet him urgently to discuss over RTC bus issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X