వైసీపీది హత్యా రాజకీయం .. జగన్ రెడ్డి హయాంలో హత్యాంధ్రప్రదేశ్ గా ఏపీ : చంద్రబాబు ధ్వజం
గుంటూరు జిల్లా గురజాల మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్య నేపథ్యంలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై, జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్యపై చంద్రబాబు ఫైర్
గురజాల నియోజకవర్గం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు 20 ఏళ్ల పాటు సర్పంచ్ గా పని చేసిన వ్యక్తిని హత్య చేయడం కిరాతక చర్య అని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నెలలలో 16 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పొట్టన పెట్టుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యాకాండ పెరిగిపోయిందని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .

సీఎం జగన్ అండ చూసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు
సీఎం జగన్ అండ చూసుకుని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అంటూ మండిపడ్డారు. వైసిపి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అధః పాతాళానికి వెళ్ళాయని అభిప్రాయపడ్డారు . ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, దాచేపల్లిలో అంకులు హత్యలు వైసిపి హత్య రాజకీయాలకు నిదర్శనమని మండిపడిన చంద్రబాబు, సీఎం జగన్ ప్రశాంతంగా ఉండే రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు హత్య కేసులో దోషులను త్వరగా పట్టుకోవాలని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు .

వైసిపి హత్యా రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులు గర్హించాలన్న చంద్రబాబు
రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయాలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. వైసిపి హత్యా రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులు గర్హించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు . రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సృష్టిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది . రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఈ దారుణాలను అరికట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . హత్యాంధ్రప్రదేశ్ గా ఏపిని మార్చేసిన జగన్ రెడ్డి అంటూ టీడీపీ నిప్పులు చేరుగుతుంది.