వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ .. ఓ అసమర్ధ సీఎం .. ఉదాసీనత వల్లే ఇదంతా .. విరుచుకుపడిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. అరకు పార్లమెంట్ టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా వైసిపి ప్రభుత్వం గిరిజన సంక్షేమం మరిచిపోయిందని విమర్శించారు. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, కనీసం తాగునీరు కూడా అందించలేని అసమర్థ ముఖ్యమంత్రి జగన్ అంటూ ద్వజమెత్తారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు ఆలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు .

Recommended Video

Daily Essentials Price Hike వైసీపీ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగాయి : Ayyanna Patrudu

 నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్ నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్

పొన్నకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఫైర్

పొన్నకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై చంద్రబాబు ఫైర్

కర్నూలు జిల్లా పొన్నకల్లు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ప్రభుత్వ ఉదాసీనత ను తప్పుబట్టారు.

ఏలూరులో 700 మంది ఆసుపత్రి పాల్గొనడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, సిగ్గుచేటని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం లో నాట్లు వేస్తూ ఆరుగురు కూలీలను అస్వస్థతకు గురి కావడం, వారిలో ఒకరు మరణించడం విషాదకర మని, హృదయవిదారక మని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు


సీఎం జగన్ మోహన్ రెడ్డి మాయ మాటలతో ప్రజలను మోసం చేయడమే కాని, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.

ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలో ఖండిస్తున్నామని చెప్పిన చంద్రబాబు, కర్నూలు జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని పెకలించటాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలాంటి ఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయని, ప్రభుత్వ తీరును చంద్రబాబు తప్పుబట్టారు.

మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఈ విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేది

మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఈ విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేది


మొదట్లోనే ఈ అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తే ఈ విధ్వంసకాండకు అడ్డుకట్ట పడేదన్నారు . ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దురాగతాలు పునరావృతం కాకుండా చూడాలి. దేవాలయాలు, దేవతా విగ్రహాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీ ఆలయాలలో దాడులు కొనసాగుతున్నాయని, అంతర్వేది రథం దగ్ధం ఘటన నుంచి ఇప్పటివరకు దేవుళ్ల విగ్రహ ధ్వంసం ఘటనలో ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటూనే ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు.

English summary
TDP chief Chandrababu Naidu has lashed out at AP CM Jagan Mohan Reddy. During a videoconference with TDP leaders in Araku Parliament, Chandrababu criticized the YCP government for forgetting tribal welfare. Chandrababu Naidu has lashed out at Chief Minister Jagan for calling for the rights of the tribals and for not at least providing drinking water. He also condemned the attack on temples and the destruction of idols.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X