వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ... చరిత్ర మీ విధ్వంసాన్ని,ఉన్మాదాన్నీ మరచిపోదు : విరుచుకుపడిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు ఏడాది కాలంగా ఏపీలో ఉన్మాద పాలన సాగుతుందని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు . ఇక అచ్చెన్నాయుడుపై అర్దరాత్రి కుట్ర జరిగిందని, ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ నాయకుల అరెస్ట్ లపై ఆయన నిప్పులు చెరిగారు . వైసీపీ పాలన అరాచక పాలన అని, ఉన్మాద పాలన అని చంద్రబాబు ఫైర్ అయ్యారు .

 విధ్వంసానికే జగన్ రెడ్డి జై.. ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది .. టీడీపీ విమర్శనాస్త్రాలు విధ్వంసానికే జగన్ రెడ్డి జై.. ప్రజావేదిక కూల్చివేతకు ఏడాది .. టీడీపీ విమర్శనాస్త్రాలు

అచ్చెన్న ప్రాణాలతో చెలగాటం

అచ్చెన్న ప్రాణాలతో చెలగాటం


ఇక టీడీపీ సీనియర్ నాయకుడు , మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు . అచ్చెన్నాయుడు ప్రాణాలతో చెలగాటం ఆడే కుట్రలు చేస్తోందీ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు . అసలు అరెస్టుచేసే ముందురోజే ఆయనకు ఆపరేషన్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఆ విషయం చెప్పినా వినకుండా అమానుషంగా వందల కిలోమీటర్లు రోడ్లపై వాహనంలో తిప్పారు.దాంతో గాయం తిరగబెట్టి రెండోసారి ఆపరేషన్ చేయాల్సివచ్చింది అని పేర్కొన్నారు . అంతేకాదు అచ్చెన్నాయుడును ఆస్పత్రి బెడ్ పైనే ప్రశ్నించాలని ఏసీబీ కోర్టు చెప్పినా కుట్రలకు తెరతీశారని విమర్శించారు .

అర్దరాత్రి అచ్చెన్నపై కుట్రలేంటి ? బీసీ నేతపై హత్యాయత్నంలా..

అర్దరాత్రి అచ్చెన్నపై కుట్రలేంటి ? బీసీ నేతపై హత్యాయత్నంలా..

అచ్చెన్న ఆరోగ్యం దృష్ట్యా కోర్టు ఆయనను నిలబెట్టవద్దు, కూర్చోపెట్టవద్దని కూడా సూచించింది. 10 రోజులు బెడ్‍ రెస్ట్ ఇవ్వాలని డాక్టర్లు చెబితే, జీజీహెచ్ అధికారులపై ఒత్తిడిచేసి, అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయాలని చూడటం ఏంటి? అంటూ మండిపడ్డారు చంద్రబాబు . ఏసీబీ అధికారులు అర్ధరాత్రే అదుపులోకి తీసుకోవాలని చూడటం ఏంటి? అసలీ అర్థరాత్రి కుట్రలేంటి? అంటూ విరుచుకుపడ్డారు . కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, ఆసుపత్రి వర్గాలపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నారని విమర్శల వర్షం కురిపించారు . ఇది కేసు విచారణలా లేదు, బీసీ నేతపై హత్యాయత్నంలా ఉందని ప్రజాసంఘాలే అంటున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు .

అచ్చెన్న కేసులో చూపే అత్యుత్సాహం ... ఆ స్కామ్ లపై ఎందుకు లేదు ?

అచ్చెన్న కేసులో చూపే అత్యుత్సాహం ... ఆ స్కామ్ లపై ఎందుకు లేదు ?

ఈ కేసులో చూపే అత్యుత్సాహం, వైసిపి ల్యాండ్ మాఫియాపై, 108 అంబులెన్స్ స్కామ్ మీద, ఆవభూముల స్కామ్ పై, ఇసుక మాఫియాపై ఎందుకులేదు? అంటూ ప్రశ్నించారు చంద్రబాబు . కొందరు పోలీసు అధికారుల విపరీత ప్రవర్తన వల్లే ఉన్నతాధికారులు కోర్టుల ముందు నిలబడాల్సి వస్తోందని నిన్ననే కోర్టులు ఆక్షేపించాయని చంద్రబాబు తెలిపారు. అధికారం చేతిలో ఉందికదా అని బీసీ నేత అచ్చెన్నాయుడు విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తే సహించేది లేదని హెచ్చరించారు . న్యాయపరంగా మేమూ పోరాడతాం. మీ కుట్రలను అడ్డుకుంటాం అంటూ ఫైర్ అయ్యారు .

టీడీపీ హయాంలో ప్రజావేదిక ఎలా ఉండేదో చెప్పిన చంద్రబాబు

టీడీపీ హయాంలో ప్రజావేదిక ఎలా ఉండేదో చెప్పిన చంద్రబాబు

ఏపీలో ప్రజావేదిక కూల్చివేతకు గురై నేటికి ఏడాది కావడంతో ప్రజా వేదిక కూల్చివేతపై టిడిపిఅధినేత చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. నేడు ప్రజావేదిక ప్రాంతాన్ని సందర్శించాలని ప్రయత్నం చేసిన టిడిపి నేతలను ఉండవల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేయ్యతాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు . తెలుగుదేశం హయాంలో ప్రజల వినతులు స్వీకరించే వేదికగా ప్రజా వేదిక ఉండేదని ఆయన పేర్కొన్నారు . అన్నివర్గాల సమస్యల పరిష్కార వేదికగా 'ప్రజావేదిక' విలసిల్లింది. విద్య, వైద్య సాయం కోసం, సమస్యలు చెప్పుకోడానికి నిత్యం అనేకమంది వచ్చేవాళ్లు. ప్రభుత్వ సాయంతో పాటు, సమస్యల పరిష్కారం పొందేవాళ్లు అంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు .

ఉలికిపాటు ఎందుకు మీకు .. ప్రశ్నించిన చంద్రబాబు

ఉలికిపాటు ఎందుకు మీకు .. ప్రశ్నించిన చంద్రబాబు


చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికను నేలమట్టం చేయడం ప్రజల ఆకాంక్షలను నేలకూల్చడమే, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని వ్యాఖ్యానించారు . ముఖ్యంగా ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. ఆ శిధిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు .

ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేశారు

ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి పునాది వేశారు


మీ విధ్వంసకర పాలనను ప్రశ్నించే హక్కు, నిరసించే హక్కు ప్రతిపక్షానికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు . ప్రశ్నించే హక్కులను హరిస్తూ అరెస్టు చేసిన తెలుగుదేశం నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . మా పార్టీ నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన చరిత్ర మీ విధ్వంసాన్ని, ఉన్మాదాన్నీ మరచిపోదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు . వైసీపీ పాలనకు కూల్చబడిన ప్రజావేదిక ఒక మోడల్ అని పేర్కొన్నారు చంద్రబాబు . అతితక్కువ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలతో పాటు అన్ని వ్యవస్థలను కూల్చివేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చంద్రబాబు పేర్కొన్నారు .

English summary
Chandrababu has said that the Opposition has the right to question and protest your destructive regime. He demanded the immediate release of the arrested Telugu Desam leaders. history will never forget your destruction mania.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X