విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ ప్రజలు చాలా మంచివాళ్లు: ఐఎఫ్ఆర్‌ వేడుకలో చంద్రబాబు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: రాబోయే రోజుల్లో ఉత్పాదక, ఎగుమతుల రంగానికి విశాఖపట్నం దేశానికే ముఖద్వారంగా మారబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. విశాఖపట్నం ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరిస్తున్న క్రమంలో విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూను గురువారం సాయంత్రం విశాఖలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. భారత్-పాక్ యుద్ధంలో మరణించిన అమరవీరులకు చంద్రబాబు గురువారం నివాళులు అర్పించారు. 1971లో ఈ యుద్ధంలో నౌకాళదానికి చెందిన పలువురు ప్రాణాలు అర్పించారు.

అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


ఇందుకు చిహ్నంగా విశాఖ బీచ్ రోడ్డులో విక్టరీ ఎట్ సీ పేరుతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా విక్టరీ ఎట్ సీ దగ్గర అమర జవానులకు నివాళులర్పించడంతో ఈ వేడుక మొదలైంది.

అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


సాయంత్రం నాలుగు గంటలకు అమర వీరుల స్థూపం వద్ద చంద్రబాబు పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులు అర్పించారు. 50 మంది సాయుధ నౌవికాదళ సైనికులు స్లో మార్చ్ చేస్తూ చంద్రబాబుని అమరవీరుల స్థూపం వద్దకు తీసుకువచ్చారు.

 అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


చంద్రబాబు నివాళులు అర్పించినప్పుడు సైనికులు సంప్రదాయ బద్ధంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ ప్రధాన అధికారి ఆర్‌కె థావన్, తూర్పు నౌకాదళ అధికారి సతీష్ సోనీ పాల్గొన్నారు.

అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మారిటైం ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్‌లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖపట్నం స్మార్ట్ సిటీగా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

 అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ స్థాయి వేడుకకు వేదిక కావటం హర్షణీయమని ఆయన అన్నారు. దేశానికి, రాష్ట్రానికి, మంచి వనరుగా తీర ప్రాంతం ఉపయోగపడుతోందన్నారు.

 అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి

51 దేశాల ప్రతినిధులు ఈ నగరానికి వచ్చిన తరుణంలో మన విశిష్టతను తెలియజేసే అవకాశం వచ్చిందన్నారు. విశాఖ ప్రజలు చాలా మంచివాళ్లు, ఈ ఐఎఫ్ఆర్‌కు ఎంతగానో సహకరిస్తున్నారన్నారు. రాబోయే మూడు రోజులు ఇదే క్రమశిక్షణతో మెలిగితే ఐఎఫ్ఆర్‌ను ఘనంగా నిర్వహించిన పేరు దక్కుతుందన్నారు.

అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


దేశీయ ఉత్పత్తి విధానానికి నాంది పలికిన నౌకాదళానికి, కార్యక్రమానికి విచ్చేసిన వివిధ నౌకాదళ అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ వేడుకలకు వేదిక కావడం మన అదృష్టమని చెప్పారు.

అమరవీరులకు చంద్రబాబు నివాళి

అమరవీరులకు చంద్రబాబు నివాళి


విశాఖ పెట్టుబడులకు చాలా అనుకూలమైనదని చెప్పారు. వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు అందర్నీ అలరించాయి.

English summary
Chandrababu paid homeage to the martyrs in a Wreath line Cermony at War momorial Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X