వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిల పక్షానికి ఆహ్వానించలేదంటూ...సిఎంవో ఎదుట విద్యార్థి జేఏసీ ఆందోళన

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ హక్కుల కోసం కేంద్రంపై సమైక్య పోరాటం కోసం సిఎం చంద్రబాబు సచివాలయంలో ఏర్పాటు చేసిన అఖిల ఫక్షాల సమావేశం ప్రారంభమైంది.
అయితే ఈ సమావేశానికి తమని ఆహ్వానించలేదంటూ సీఎం కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు ఆందోళన దిగడం ఉద్రిక్తతకు దారితీసింది.

సిఎంతో సమావేశానికి తమని కూడా అనుమతించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పాటు నినాదాలు చేస్తుండటంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.
ఆహ్వానం లేనందున సమావేశానికి పంపడం కుదరదని, ఆదేశాలు వస్తే లోపలకు పంపండం జరుగుతుందని, అప్పటివరకు ఇక్కడ ఉండరాదంటూ విద్యార్థి జెఎసి ప్రతినిధులను సచివాలయం ప్రాంగణం నుంచి బైటకు పంపించివేశారు.

chandrababu all party meeting held secretariat navyandhra student jac agitation invite
అయితే ఏ ఉద్యమం అయినా విద్యార్థుల పాత్ర కీలకమని, కేంద్రంపై పోరాటానికి రాష్ట్రానికి సంబంధించి ఇంత ముఖ్యమైన సమావేశం జరుగుతుంటే విద్యార్థి సంఘాలను ఆహ్వానించకపోవడం సరికాదని విద్యార్థి సంఘాల సంఘాల ప్రతినిధులు అంటున్నారు. తెలంగాణా ఉద్యమంలో కూడా విద్యార్థి సంఘాలు కీలక పాత్ర పోషించిన విషయాన్ని మరువరాదన్నారు. సిఎం చంద్రబాబు ఇప్పటికైనా విద్యార్థుల ప్రాధాన్యతను గుర్తించి అఖిల పక్షం సమావేశానికి విద్యార్థి సంఘాలను ఆ ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు విచ్చేసిన ఏపీ ఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబు మీడియాతో మాట్లాడుతూ...ఇప్పుడు పోరాటం చేయకపోతే నష్టం జరిగేది రాష్ట్రానికేనని, అలాగని ఉద్యోగాలు మాని ఉద్యమం కోసం రోడ్లపైకి వస్తే నష్టం జరిగేది కూడా రాష్ట్రానికే నని కేంద్రానికి కాదని అన్నారు. అయితే అఖిలపక్ష సమావేశంలో తమ ఎజెండా ఏమిటనేది స్పష్టంగా తెలియజేస్తామన్నారు. అలాగే అఖిలపక్ష నిర్ణయాన్నిబట్టి పోరాటం కొనసాగిస్తామని అశోక్‌బాబు స్పష్టం చేశారు.

English summary
Amaravathi: Navyandhra Student JAC held an agitation for not inviting them to the the an all-party meeting hold by CM Chandrababu at secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X