వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితో కటీఫ్: కేంద్రం వివక్ష, రేపు అసెంబ్లీలో బాబు ప్రకటన?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయిన టిడిపి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నిధుల కేటాయింపు విషయమై బిజెపి అనుసరిస్తున్న విధానాల పట్ల టిడిపి తీవ్ర అసంతృప్తితో ఉంది. బిజెపి తెగదెంపులు చేసుకోవాలని పార్టీ ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడుకు తేల్చి చెప్పారు.

శుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబుశుభవార్త: 90 శాతం నిధులిచ్చేందుకు కేంద్రం ఒకే, ప్రత్యేక హోదాపై చర్చ: హరిబాబు

నాలుగురైదుగురు వేచి చూద్దామని బాబుకు సూచించారు. మెజార్టీ నేతలు బిజెపితో తెగదెంపులు చేసుకోవలని చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో బిజెపితో పొత్తు విషయమై తేల్చి చెప్పే అవకాశం ఉంది. బిజెపితో కటీఫ్ చేసుకొంటున్నట్టు బాబు ప్రకటించే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, రెవిన్యూ లోటును భర్తీ చేయాలి: యనమలఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, రెవిన్యూ లోటును భర్తీ చేయాలి: యనమల

అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని మంగళవారం నాడు అమరావతిలో టిడిఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్రమైన చర్చ జరిగింది.

అరుణ్ జైట్లీతో యనమల భేటీ: అమిత్ షా డుమ్మా, కేంద్రం దిగొచ్చేనా?అరుణ్ జైట్లీతో యనమల భేటీ: అమిత్ షా డుమ్మా, కేంద్రం దిగొచ్చేనా?

ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కన్పిస్తోంది.

బిజెపితో కటీఫ్

బిజెపితో కటీఫ్

టిడిఎల్పీ సమావేశంలో బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని మెజారీటీ టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. నలుగురైదుగురు ప్రజాప్రతినిధులు మాత్రం వేచి చూద్దామని బాబుకు సూచించారు. కేంద్రం నుండి బయటకు వద్దామా, ఓపిగ్గా ఉందామా అనే అంశంపై చంద్రబాబునాయుడు పార్టీ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరించారు. మెజారిటీ ప్రజాప్రతినిధులు బిజెపికి రాం రాం చెప్పాలని తేల్చి చెప్పారు.

పోరాటాన్ని అపహస్యం చేస్తున్నారు

పోరాటాన్ని అపహస్యం చేస్తున్నారు

ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పోరాటం చేస్తోటే కేంద్రం అపహస్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేస్తోంటే పోరాటాన్ని అపహస్యం చేయడం సరైందా అని బాబు టిడిఎల్పీ సమావేశంలో ప్రశ్నించారు.రక్షణ రంగానికి నిధులు కేటాయిస్తామని లీకులు ఇవ్వడంపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీలోనే ప్రకటన

అసెంబ్లీలోనే ప్రకటన

కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లోనే స్పష్టత ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. బహుశా బిజెపితో తెగదెంపులు చేసుకొనే విషయమై చంద్రబాబునాయుడు అసెంబ్లీ వేదికగానే ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. టిడిఎల్పీ సమావేశంలోనే బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

బిజెపి నేతలు ఓట్లు ఎలా అడుగుతారు

బిజెపి నేతలు ఓట్లు ఎలా అడుగుతారు

బిజెపికి చెందిన రాష్ట్ర నేతలను కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలకు ఇంచార్జీలకు నియమించారని బాబు గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను బిజెపి నేతలు ఏమని ఓట్లు అడుగుతారని బాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని బాబు తేల్చి చెప్పేశారు.

విపక్షంలో ఉంటే నిధులు రావా

విపక్షంలో ఉంటే నిధులు రావా

విపక్ష పార్టీల్లో ఉన్న సీఎంలు చాలా కాలం పాటు అధికారంలో కూడ ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ శాసనసభపక్ష సమావేశంలో ప్రస్తావించారు. అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉంటేనే నిధులు వస్తాయా అని ప్రశ్నించారు. దేశంలోని పలు చోట్ల విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన అంశాలను కూడ బాబు ప్రస్తావించారు.

English summary
Tdp chief Chandrababunaidu sensational comments on Bjp in TDLP meeting held at Amaravathi on Tuesday. Tdp planning to withdraw alliance with Bjp. chandrababu naidu will key announcement on Wednesday in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X