వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలప్రియ, రామ్మోహన్ నాయుడు సూపర్: చంద్రబాబు, చిరునవ్వు

తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భూమా అఖిలప్రియలపై మహానాడు వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రశంసలు కురిపించారు. వారు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు

|
Google Oneindia TeluguNews

విశాఖ: తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు, మంత్రి భూమా అఖిలప్రియలపై మహానాడు వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ప్రశంసలు కురిపించారు. వారు అద్భుతంగా పని చేస్తున్నారని కితాబిచ్చారు.

లోకేష్ మాట్లాడుతుంటే టైం అయిపోయిందంటూ.., నేతలకు బాబు క్లాస్లోకేష్ మాట్లాడుతుంటే టైం అయిపోయిందంటూ.., నేతలకు బాబు క్లాస్

టిడిపి యువతకు పెద్దపీట వేస్తుందని చంద్రబాబు అన్నారు. యువకుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రజల నేతగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు.

ఎర్రన్నాయుడి మృతి తీరని లోటు.. అలాంటప్పుడు...

ఎర్రన్నాయుడి మృతి తీరని లోటు.. అలాంటప్పుడు...

ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణం పార్టీకి తీరనిలోటుగా మారిందని చంద్రబాబు అన్నారు. యువతలో ఉన్న శక్తిని గ్రహించి వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో టిడిపి ఎప్పుడూ ముందుంటుందన్నారు.

నవ్విన రామ్మోహన్ నాయుడు

నవ్విన రామ్మోహన్ నాయుడు

ఎర్రన్నాయుడు తనకు ఆత్మీయుడని చంద్రబాబు చెప్పారు. ఆయన కుటుంబం సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన గురించి మాట్లాడుతున్న సమయంలో రామ్మోహన్ నాయుడు నవ్వుతూ కనిపించారు.

అఖిలప్రియకు ప్రశంస

అఖిలప్రియకు ప్రశంస

తండ్రి చనిపోవడంతో భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చామని, ఆమె కూడా సమర్థవంతంగా పని చేస్తూ తన నమ్మకాన్ని నిలబెడుతోందన్నారు.

కార్యకర్తల సంక్షేమానికి రూ.42 కోట్లకు పైగా..

కార్యకర్తల సంక్షేమానికి రూ.42 కోట్లకు పైగా..

ఇదిలా ఉండగా, కార్యకర్తల సంక్షేమం కోసం టిడిపి రూ.42 కోట్ల 92 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. అందులో భాగంగా రూ.10 కోట్లు కార్యకర్తల పిల్లల చదువు, ఆరోగ్యం కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు కార్యకర్తలు చనిపోతే వాళ్ల కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకున్నట్లు చెప్పారు. భారతదేశంలో 1,700 రాజకీయ పార్టీలు ఉన్నాయని, ఇలాంటి కార్యక్రమాలు ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చేస్తుందా అని నారా లోకేష్ ప్రశ్నించారు.

రాజధాని డిజైన్లపై త్వరలో నిర్ణయం

రాజధాని డిజైన్లపై త్వరలో నిర్ణయం

అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లని చంద్రబాబు అన్నారు. రాజధానిపై ఎన్ని అడ్డంకులు సృష్టించినా పనులు ఆగవన్నారు. పోలవరంతో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామన్నారు. ఏపీలో పట్టణీకరణ తక్కువని, పట్టణీకరణ పెరిగితేనే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. విశాఖ, తిరుపతి సహా అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన భవన సముదాయం డిజైన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

యాప్ ప్రారంభించాం

యాప్ ప్రారంభించాం

టెక్నాలజీని రైతుల వద్దకు చేరుస్తున్నామని చంద్రబాబు తెలిపారు. పంట తెగుళ్లను తెలుసుకునేందుకు యాప్‌ ప్రారంభించామన్నారు. ఎండు దశలో ఉన్న పంటలు, దగ్గరలో ఉన్న నీటి వివరాలను, తెలిపే యాప్‌ను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చేవారి సేవలు వినియోగించుకుంటామన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Monday praised Minister Akhila Priyna and TDP MP Rammohan Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X