వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాతృభాషా దినోత్సవం: చంద్రబాబు ఇలా (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలుగు మీడియం విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అదనంగా 10 శాతం మార్కులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శతాధిక భాషా సేవకులను చంద్రబాబు సత్కరించారు.

దేశంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో తెలుగుకు రెండవ స్థానం ఉందని ఆయన చెప్పారు. తెలుగును ఎన్టీఆర్ అన్ని విధాలా ముందుకు తెచ్చారని, పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టారని గుర్తుచేశారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు.

అర్హులైన కవులను నెలకు రూ.2500 గౌరవ వేతనంతో ప్రోత్సహిస్తామని, వంద కవితలు రాసిన ప్రతి కవికి పుస్తక ముద్రణ కోసం రూ.20 వేలు సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మాతృభాషా దినోత్సవంలో బాబు

మాతృభాషా దినోత్సవంలో బాబు

పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

ఇలా సత్కారం..

ఇలా సత్కారం..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా శుక్రవారం చంద్రబాబు నాయుడు భాషా సేవకులను ఇలా సత్కరించారు.

విజయరామారావు కూడా..

విజయరామారావు కూడా..

చంద్రబాబుకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి కె. విజయరామారావు అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవంలో పాల్గొన్నారు.

తెలుగులో మాట్లాడాలి...

తెలుగులో మాట్లాడాలి...

దేశంలో తెలుగువారికి గుర్తింపు ఉండాలంటే మాతృభాషలోనే మాట్లాడాలని కోరారు. తెలుగు భాషకు ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు.

ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇలా..

ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఇలా..

ఎన్టీ రామారావు విగ్రహం వద్ద మాజీ మంత్రి కె. విజయరామారావుతో పాటు వివిధ భాషా సేవకులు ఇలా..

రాష్ట్ర విభజన తీరుపై ఆగ్రహం..

రాష్ట్ర విభజన తీరుపై ఆగ్రహం..

శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెసు పార్టీని దుమ్మెత్తిపోశారు.

ప్రముఖులతో ఇలా..

ప్రముఖులతో ఇలా..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి కె.విజయరామారావు, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ, ప్రముఖ కవి తిరునగరి కూడా ప్రసంగించారు.

English summary
Telugudesam party president Nara Chandrababu Naidu has promised 10 percent reservations for Telugu medium students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X