హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి వస్తే బాగుంటుంది: బాబు, జయసుధకు మురళీమోహన్ అభినందన

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలో స్థిరపడిదే బాగుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. బుధవారం నాడు పలువురు సినీ ప్రముఖులు చంద్రబాబును కలిశారు.

చంద్రబాబును కలిసిన వారిలో 2012-13 సంవత్సరాల నంది అవార్డుల ఎంపిక కమిటీ ఉంది. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడారు.

<strong>ఈ మధ్యే బస్సు కొన్నాం, కేశినేని నానితో మాట్లాడా: జేసీ దివాకర్ రెడ్డి</strong>ఈ మధ్యే బస్సు కొన్నాం, కేశినేని నానితో మాట్లాడా: జేసీ దివాకర్ రెడ్డి

చిత్ర పరిశ్రమ ఏపీలో స్థిరపడేందుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అన్ని సంవత్సరాల నంది అవార్డులను ఒకే వేదిక పైన ఇవ్వాలన్న ఆలోచన ఉందని తెలిపారు.

Chandrababu promises aid for film industry

కాగా, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించి నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 2012-13 సంవత్సరానికి గాను అవార్డులను ప్రకటించారు.

విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయసుధ అధ్యక్షతన ఏర్పాటయిన కమిటీ అవార్డులను ప్రకటించింది. ఆ కార్యక్రమంలో మురళీ మోహన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అవార్డుల ఎంపిక చాలా కష్టంతో కూడుకున్న పని అని జయసుధ అన్నారు. రెండు నెలల పాటు కష్టపడి మంచి చిత్రాలను ఎంపిక చేశారని జయసుధతో పాటు కమిటీ సభ్యులను మురళీమోహన్ అభినందించారు.

English summary
Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu promised all help to film industry in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X