వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోకి చంద్రబాబు ఎంట్రీ.. తనిఖీల్లేవ్.. జగన్‌పై లోకేశ్ సంచలనం.. పప్పు అలిగాడన్న విజయసాయి..

|
Google Oneindia TeluguNews

'అయన అడుగుపెట్టడమే ఆలస్యం.. పట్టుకుని క్వారంటైన్ కు తరలిస్తాం'.. 'ఇకాయన ఏపీకి రాడు.. హైదరాబాద్ లోనే శాశ్వత లాక్ డౌన్'.. ఇవీ.. వైసీపీ మంత్రులు, కీలక నేతలు.. టీడీపీ చీఫ్ చంద్రబాబును ఉద్దేశించి ఇటీవల చేసిన కామెంట్లు. కానీ వాస్తవంలో మాత్రం ప్రభుత్వం ప్రోటోకాల్ నే ఫాలో అయింది. ప్రతిపక్షనేతగా బాబు ప్రివిలేజ్ కు భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించారు. విశాఖపట్నానికి విమానం రద్దు కావడంతో హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గన బయలుదేరిన చంద్రబాబు.. సోమవారం మధ్యాహ్నానికి అమరావతి చేరుకున్నారు.

Recommended Video

Chandrababu Enters In To Amaravathi By Road Way, Vijayasai Reddy Slams Nara Lokesh
దారిపొడవునా ఇలా..

దారిపొడవునా ఇలా..

కరోనా లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ కు పరిమితమైపోయిన చంద్రబాబు.. 65 రోజుల తర్వాత ఏపీలో అడుగుపెట్టారు. బాబు కాన్వాయ్ ఏపీలోకి ఎంటైరన దగ్గర్నుంచి పలు కూడళ్ల వద్ద టీడీపీ శ్రేణులు చేతులూపుతూ స్వాగతం పలికారు. కోదాడ సరిహద్దుకు తమ్ముళ్లు భారీగా చేరుకోవడంతో బాబు కారు నుంచి బయటికొచ్చి, అందరికీ అభివాదం చేశారు. డీజీపీ గౌతం సవాంగ్ నుంచి ముందే అనుమతి పొందిఉండటంతో బాబు కాన్వాయ్ ని తనిఖీ చేయకుండానే పోలీసులు అనుమతించారు. బోర్డర్ చెక్ పోస్టు వద్ద బాబుకు కరోనా టెస్టులు చేసిన దాఖలాలు కూడా లేవు. కాగా..

లోపల లోకేశ్ లేడా?

లోపల లోకేశ్ లేడా?

హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రయాణం కోసం చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అనుమతి పొందారు. సోమవారం ఉదయం జూబ్లి హిల్స్ నుంచి బయలుదేరిన కాన్వాయ్ లోపల లోకేశ్ కూర్చోలేదంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ తనకు ఇవ్వనిదే హైదరాబాద్ కదిలిరానంటూ లోకేశ్ మారాం చేశాడని, చిన్నపిల్లలు ఇలా మంకుపట్టు పట్టడం తప్పని ఎంపీ ఎద్దేవా చేశారు.

పప్పూ.. నాన్న మీద అలిగావా?

పప్పూ.. నాన్న మీద అలిగావా?

చంద్రబాబు కాన్వాయ్ కదలికలపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా.. అందులో నారా లోకేశ్ లేరన్న విషయాన్ని వైసీపీ విజయసాయి ఒక్కరే ప్రస్తావించారు. ‘‘బిల్ గేట్స్ ని తీసుకొచ్చానన్నావ్... బిల్ క్లింటన్ ని తీసుకొచ్చానన్నావ్... టోనీ బ్లెయిర్ ని తీసుకొచ్చానన్నావ్... ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా? పప్పూ.. తప్పు కదా.. నాన్న మీద అలిగేవా? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా?''అంటూ వరుస ట్వీట్లు చేశారు. అటు టీవీల్లో మాత్రం లోకేశ్ కూడా ఏపీకి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చివరిదాకా సస్పెన్స్ కొనసాగింది.

సీఎంపై సంచలన వ్యాఖ్యలు..

సీఎంపై సంచలన వ్యాఖ్యలు..

టీటీడీ భూముల అమ్మకం వ్యవహారంలో వైసీపీ సర్కారును విమర్శించే క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘‘పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి''అంటూ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి.. దేవుడి మాన్యాలను వదిలిపెడతాడనుకోవడం అత్యాశే అవుతుంది. భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీవారికే ఉంది. గోవిందా... గోవిందా''అంటూ లోకేశ్ చేసిన ట్వీట్ దుమారం రేపుతున్నది.

రేపు విశాఖకు బాబు?

రేపు విశాఖకు బాబు?

ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం టీడీపీ చీఫ్ చంద్రబాబు హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ వెళ్లి, అక్కడ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధిత గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా, ఫ్లైట్ సర్వీసులు రద్దు కావడంతో ఆయన రోడ్డు మార్గంలో అమరావతికి వచ్చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంలో ప్ర‌తీ ఏటా పార్టీ వేడుక‌గా నిర్వహించే మహానాడు కార్యక్రమం బుధ, గురువారాల్లో (నెల 27,28 తేదీల్లో) జరుగనుంది. ఈసారి ఆన్ లైన్ విధానంలో, జూమ్ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహానాడు కంటే ముందే గ్యాస్ బాధితుల్ని పరామర్శించాలనుకుంటోన్న చంద్రబాబు.. మంగళవారం ఉదయం విశాఖ వెళతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
opposition leader and tdp chief chandrababu enters in to andhra pradesh after two months. nara lokesh criticise cm jagan. ysrcp mp vijayasai reddy slams tdp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X