• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జూ ఎన్టీఆర్ తో చంద్రబాబు మంతనాలు..!! ఆ రెస్సాన్స్ తో షాక్ - అటు పవన్ కళ్యాణ్ సైతం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి..వ్యక్తిగతంగా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఊహించని పరాజయం పాలైన టీడీపీని..ఏపీలో తిరిగి నిలబెట్టుకొనేందుకు ఏ అవకాశాన్ని వీడకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ రెండున్నారేళ్ల పాలన పైన వ్యతిరేకత మొదలైందనే భావన టీడీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే...2014 ఫార్ములా అమలు చేయాలనేది చంద్రబాబు వ్యూహం. అయితే, బీజేపీతో తిరిగి సఖ్యత కుదిరేనా లేదా అనేది ఇప్పటికీ స్పష్టత లేదు.

టీడీపీ - జనసేన కలుస్తాయంటూ

టీడీపీ - జనసేన కలుస్తాయంటూ

ఇదే సమయంలో బీజేపీతో జత కట్టిన పవన్ కళ్యాణ్ వైఖరిలోనూ మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాల్లో పలు చోట్ల టీడీపీ- జనసేన అవగాహన తో పని చేసి కొన్ని స్థానాలు దక్కించుకున్నారు. దీంతో..టీడీపీ - జనసేన తిరిగి జత కట్టాలని మాజీ మంత్రులు సైతం కోరుతున్నారు. జనసేన కింది స్థాయి నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, టీడీపీ నేతల నుంచి వస్తున్న ప్రతిపాదనల పైన ఇప్పటి వరకు జనసేన ఎక్కడా వ్యతిరేకంగా అదే సమయంలో అనుకూలంగానూ స్పందించలేదు. వేచి చూసే ధోరణితో కనిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ కోసం పార్టీలో ఒత్తిడి

జూనియర్ ఎన్టీఆర్ కోసం పార్టీలో ఒత్తిడి

ఇక, టీడీపీ లో కొంత కాలంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం డిమాండ్ బలంగా వినిపిస్తోంది. సంక్షేమ పథకాలతో ఓటుబ్యాంకును ఏర్పరుచుకుంటూ సోషల్‌ ఇంజనీరింగ్‌ ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొనాలంటే ఇప్పుడున్న పార్టీ స్థితిగతులు సరిపోవని టిడిపి సీనియర్‌ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే పార్టీకి ఓ పెద్ద ఊపు రావాలని వారు కోరుతున్నారు. జూ.ఎన్టీయార్‌ను కూడా రంగంలోకి దింపాలని పార్టీ సీనియర్‌ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

జూనియర్ కు చంద్రబాబుకు ఫోన్

జూనియర్ కు చంద్రబాబుకు ఫోన్

దీంతో చంద్రబాబు జూ.ఎన్టీయార్‌తో ఫోన్‌ చేసి మాట్లాడారని తెలిసింది. జూ.ఎన్టీయార్‌ పాజిటివ్‌గానే స్పందించినప్పటికీ కీలకమైన మార్పులను సూచించినట్లు తెలిసింది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసి తన సత్తా చాటారు. ఇక, ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా దూరంగా ఉన్నారు. లోకేశ్ పార్టీలో క్రియాశీలకమైన తరువాత జూనియర్ కు అవకాశం దక్కలేదు. అయితే, ఇప్పుడు పార్టీ వీడుతున్న అనేక మంది సీనియర్లు లోకేశ్ ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా పరామర్శల యాత్రలతో లోకేశ్ కేడర్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

జూనియర్ ఆన్సర్ తో కొత్త ఆలోచనలు

జూనియర్ ఆన్సర్ తో కొత్త ఆలోచనలు

అయినా.. వైసీపీ ఇప్పుడు బలంగా కనిపిస్తున్న సమయంలో జూనియర్ తో చంద్రబాబు చర్చలు చేసారని కధనాలు వస్తున్నాయి. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీ గురించి అనేక అంశాలు ప్రస్తావించటంతో చంద్రబాబు షాక్ అయ్యారని పార్టీలో ప్రచారం సాగుతోంది. జూనియర్ తన తాన పెట్టిన పార్టీ కోసం ఎప్పుడూ తన సేవలు అందించటానికి సిద్దంగానే ఉంటానంటూ స్పష్టం చేసారు. పార్టీ కోసం పని చేయాల్సి ఉందని చంద్రబాబు ప్రతిపాదించగా.. జూనియర్ సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు.

జూనియర్ రంగంలోకి ఖాయమేనా

జూనియర్ రంగంలోకి ఖాయమేనా

అయితే, పార్టీ కోసం పని చేస్తున్న కింది స్థాయి కేడర్ కు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టాలని..వారిలో జోష్ నింపే కార్యాచరణ అవసరమని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ విషయంలో గతంలో లోకేశ్..బాలయ్య స్పందించిన తీరు పైనా పార్టీలో చర్చ సాగుతోంది. జూనియర్ తన అవసరం ఉందని భావిస్తే ఖచ్చితంగా తాను చేయగలిగింది చేస్తానని చెబుతున్నా... బాలయ్య - లోకేశ్ ఆ అవకాశం ఇస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.

  Andhra Pradesh లో Load Relief కి వేళాయరా.. కోతల వేళలు | Electricity Crisis || Oneindia Telugu
  జగన్ ను ఎదర్కోవాలంటే 2014 పొత్తులు తప్పవా

  జగన్ ను ఎదర్కోవాలంటే 2014 పొత్తులు తప్పవా

  అయితే, చంద్రబాబు మాత్రం ఎవరినీ దూరం చేసుకోవటానికి సిద్దంగా లేరు. కేంద్ర ప్రభుత్వం పైనా టీడీపీ ఎక్కడా వ్యతిరేకంగా స్పందించటం లేదు. పార్లమెంట్ లోనూ కేంద్ర నిర్ణయాలకు మద్దతిస్తూనే ఉంది. అదే సమయంలో జగన్ సైతం కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో టీడీపీ అధినేత వ్యూహాలు ఎంత వరకు పార్టీకి మేలు చేస్తాయి... జూనియర్ - పవన్ విషయంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు టీడీపీతీ పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కరంగా మారుతోంది.

  English summary
  Chandrababu reaches out to Junior NTR but was shocked with the reply.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X