వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ రోజు ఏపీకి బ్లాక్ డే.. కర్ఫ్యూ లా ఉంది .. ఇది పిరికిపంద చర్య ... చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . అమరావతిని తరలించాలనే నిర్ణయం చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు .రాజధాని అమరావతి రైతుల పోరాటాన్ని పట్టించుకోకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉందన్న చంద్రబాబు అమరావతిని రాజధానిగా సాధించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు .

అప్పుడు జగన్ చెప్పిందే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లుగా .. విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్అప్పుడు జగన్ చెప్పిందే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లుగా .. విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్

భవిష్యత్ తరం కోసం పోరాటం చేస్తామన్న చంద్రబాబు

భవిష్యత్ తరం కోసం పోరాటం చేస్తామన్న చంద్రబాబు


ఏపి కేబినెట్ నిర్ణయాలపై తెలుగు దేశం పార్టీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాను ఉద్దేశించి కేబినెట్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు. భవిష్యత్ తరం మరియు అమరావతి కోసం తాము పోరాడుతామని నొక్కి చెప్పారు. పోలీసులు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసిన మూడు రాజధానుల ప్రకటన చేసిన ఈ రోజు బ్లాక్ డే అని పేర్కొన్నారు. ఈ విధమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ పునరావృతం కాలేదని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు చర్య అని ఆయన పేర్కొన్నారు.

మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం

మూడు రాజధానుల నిర్ణయం దుర్మార్గం

మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలని జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా నిర్ణయం తీసుకుందని చంద్రబాబు పేర్కొన్నారు . గతంలో ఎన్నడూ ఇంత దుర్మార్గం జరగలేదన్నారు. చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది పిరికిపందల చర్య అని, ఈ నిర్ణయానికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని వ్యాఖ్యానించారు.

 ఇది వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య

ఇది వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్య

అమరావతి, ఏపీ రాజధాని అంశంపై జగన్ కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు చంద్రబాబు . ఎట్టి పరిస్థితుల్లోనూ 3 రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని పిరికిపంద చర్య అని మండిపడ్డారు . హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానిని అమరావతికి తరలించినప్పుడు కూడా ఈ స్థాయిలో బందోబస్తు పెట్టలేదని చంద్రబాబు గుర్తుచేశారు.

 ఈ రోజు బ్లాక్ డే.. రాష్ట్రంలో కర్ఫ్యూ

ఈ రోజు బ్లాక్ డే.. రాష్ట్రంలో కర్ఫ్యూ

విభజన సమయంలో కూడా ఇలాంటి కర్ఫ్యూ వాతావరణం చూడలేదన్నారు . ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని.. ఇది 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు వైఎస్ జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతులపై అమానుషంగా ప్రవర్తిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతి ఉండాలని అందుకోసం ఎంతవరకైనా వెళ్తాం అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు .

English summary
Telugu Desam Party chief, former Andhra Pradesh chief minister Chandrababu Naidu reacted on AP cabinet decisions on Monday. Addressing the media, Naidu dismissed the cabinet decision and asserted that they will fight for the future generation and Amaravati. Naidu said that police arresting every leader and termed the day as a 'black day'. He added that these type of actions never repeated in the history of Andhra Pradesh. He stated that the arresting of TDP leaders across the state is a shameful act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X