అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏకగ్రీవాల మాటున వైసీపీ నేతల అరాచకాలు .. వీడియోలు రిలీజ్ చేసిన చంద్రబాబు టార్గెట్ అదేనా !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లె ప్రగతి పంచసూత్రాలు పేరిట మేనిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు ఏకగ్రీవం మాటున వైసీపీ నేతల అరాచకాలు అంటూ వీడియోను రిలీజ్ చేసి అధికారి వైసీపీపై మండిపడ్డారు. కరోనాకు ముందు ఎంపీటీసీ ,జడ్పిటిసి ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వీడియో విడుదల చేశారు. గతంలో ఏకగ్రీవాల మాటున వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారంటూ, ఇంతకు ముందెప్పుడూ ఈ స్థాయిలో ఏకగ్రీవాలు జరగలేదని చంద్రబాబు విమర్శించారు.

 నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్ నిమ్మగడ్డపై విరుచుకుపడిన వైసీపీ ఎంపీ సాయిరెడ్డి .. చంద్రబాబు కోసమే ఎన్నికలని ఫైర్

వైసిపి దౌర్జన్యాలతో 2,274 ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు ఫైర్

వైసిపి చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కావని పేర్కొన్న చంద్రబాబు నాయుడు అవన్నీ దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలు అని మండిపడ్డారు.

ఒకటి కాదు రెండు కాదు వైసిపి దౌర్జన్యాలతో 2,274 ఏకగ్రీవాలు చేశారని పేర్కొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న వివిధ సంఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. ప్రజల ఆమోదం లేని ఈ తరహా ఏకగ్రీవాలు ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

టిడిపి హయాంలో అనేక రంగాలలో నెంబర్ 1 గా రాష్ట్రాన్ని నిలిపాం కానీ వైసీపీ హయాంలో

టిడిపి హయాంలో అనేక రంగాలలో నెంబర్ 1 గా రాష్ట్రాన్ని నిలిపాం కానీ వైసీపీ హయాంలో

ప్రజలకు భరోసా ఇస్తున్నామని, గ్రామాల్లో ప్రార్థనాలయాలను కాపాడే బాధ్యత సర్పంచులు తీసుకుంటారని చంద్రబాబు చెప్పారు. గ్రామాలలో రౌడీయిజాన్ని అరికడతామని, భూ కబ్జాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని, ఎల్ఈడీ బల్బులు పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్న చంద్రబాబు టిడిపి హయాంలో అనేక రంగాలలో నెంబర్ 1 గా రాష్ట్రాన్ని నిలిపామని స్పష్టం చేశారు.

ప్రజాక్షేత్రంలో వైసిపి అక్రమాలను ఎండగట్టే పనిలో టీడీపీ

ప్రజాక్షేత్రంలో వైసిపి అక్రమాలను ఎండగట్టే పనిలో టీడీపీ

గతంలో గ్రామాలలో 25 వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తే వైసిపి హయాంలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లను వేశారు అంటూ నిలదీశారు. ప్రజాక్షేత్రంలో వైసిపి అక్రమాలను ఎండగట్టడంలో భాగంగానే చంద్రబాబు నాయుడు వీడియో ప్లే చేసి మరి కరోనాకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో జరిగిన దాడులను చూపించారు. అంతేకాదు గత సంవత్సరం ఎన్నికల సందర్భంగా నామినేషన్ వేయడానికి వెళ్తున్న టిడిపి అభ్యర్థులపై వైసిపి వారు చేసిన దాడులు దారుణమని పేర్కొన్నారు.

 నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా వైసీపీ అరాచకాలపై సోషల్ మీడియాలో ఏకరువు

నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా వైసీపీ అరాచకాలపై సోషల్ మీడియాలో ఏకరువు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలలో నామినేషన్ వేసే స్వేచ్ఛ కూడా లేకుండా అరాచకాలు దాడులు చేస్తున్నారు వైసిపి నాయకులని ఈ సంఘటనలను టిడిపి తీవ్రంగా ఖండిస్తోంది అని రాష్ట్రంలో శాంతియుతంగా ఎన్నికలు జరపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని సోషల్ మీడియా వేదికగా కూడా టీడీపీ స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలోనూ నాటి దాడుల ఘటనలను ప్రజలకు చూపిస్తూ వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వ్యతిరేఖత పెంచే ప్లాన్ లో ఉన్నారు .

English summary
Chandrababu Naidu said that the unanimous in villages was not with the consent of the people and that all these were coercive conventions that were carried out by intimidation with atrocities and attacks by ycp . Noting that not one, not two, 2,274 unanimous was reached with YCP atrocities, Chandrababu showed videos of various recent incidents on the occasion. Chandrababu made it clear that such unanimous without the consent of the people could not be tolerated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X