వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా లేఖ ఓ దాడి, కించపరిచారు, రెచ్చగొట్టారు: విరుచుకపడ్డ చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

వాస్తవాలు చెప్పే ధైర్యం కేంద్రానికి ఉందా.. అలా చెప్తే కేసులు పెట్టిస్తా అంటున్నారు.

అమరావతి: బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విభజన హామీలపై ఆయన శనివారం ఆయన శాసనసభలో మాట్లాడారు.

అమిత్ షా లేఖలో అన్నీ వక్రీకరణలేనని, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. విభజన హామీలను అమలు చేసి ఉంటే రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చి ఉండేవని ఆయన అన్నారు. పన్నులు వసూలు చేసుకుని రాయితీలు అడిగితే ఇవ్వడం లేదని అన్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఇంత ఆందోళన చేస్తున్నా కూడా...

ఇంత ఆందోళన చేస్తున్నా కూడా...

ఇంత ఆందోళన చేస్తున్నా కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావడం లేదా అని చంద్రబాబు అడిగారు. పార్లమెంటులో ఆందోళన చేస్తున్నా లెక్కలేని తనంతో పోతున్నారని, ఇది దుర్మార్గమని అన్నారు. మీరు చెప్పిన మాటకు చేసిన పనులకు పొంతన ఉందా అని ఆయన కేంద్రాన్ని అడిగారు.

వారికి ఇచ్చినప్పుడు మనకు ఎందుకివ్వరు

వారికి ఇచ్చినప్పుడు మనకు ఎందుకివ్వరు

ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మనకు ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు అడిగారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని అన్నారు.

అమిత్ షా లేఖ ఓ దాడి

అమిత్ షా లేఖ ఓ దాడి

అమిత్ షా తనకు రాసిన లేఖ ఓ దాడి అని, అది తనపై దాడి కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దాడి అని చంద్రబాబు అన్నారు. లేఖలో అర్థసత్యాలు, అసత్యాలు నిండి ఉన్నాయని అన్నారు. ఓ ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి హుందాతనం ఉండాలని, అసత్యాలు చెప్పకూడదని ఆయన అన్నారు.

 ఈ లేఖ అందరూ చదవాలి

ఈ లేఖ అందరూ చదవాలి

ఎవరి మీద దాడి చేస్తారని చంద్రబాబు అమిత్ షాపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. అమిత్ షా రాసిన లేఖను రాష్ట్ర ప్రజలంతా చదవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ ఉద్దేశంతో తాము ఎన్డీఎ నుంచి తప్పుకుంటున్నట్లు అమిత్ షా అన్నారని, తాము అభివృద్ధి కోసమే ఎన్డీఎ నుంచి తప్పుకున్నామని ఆయన అన్నారు.

రెచ్చగొడుతూ రాసిన లేఖ

రెచ్చగొడుతూ రాసిన లేఖ

అమిత్ షా లేఖ రాష్ట్రాన్ని కించపరుస్తూ, రెచ్చగొడుతూ రాసిన లేఖ అని ఆయన అన్నాుర. మీరు చెప్పినదానికి ఇక్కడ జరిగినదానికి ఎంతు పొంత ఉందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్ని రోజులు ప్రజలను మభ్య పెడుతారని ఆయన ప్రశ్నించారు.

విభజన బిల్లుకు బిజెపి సహకరించిందని చంద్రబాబు అన్నారు. 20 నిమిషాల్లో బిల్లు పాస్ చేశారని అన్నారు. దేశమంతా ఉడికిపోయిందని అన్నారు. ఆ రోజు అమిత్ షా ఢల్లీలో లేకపోవచ్చు గానీ తాను ఉన్నానని ఆయన చెప్పారు. వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేశారని అన్నారు. చివరి వరకు తమ ఎంపీలు పోరాటం చేశారని అన్నారు. రాజ్యసభలో అరిచి అరిచి పోరాటం చేశారని అన్నారు. అంధ్రప్రదేశ్ హక్కుల కోసం తామే పోరాడామని అమిత్ షా తన లేఖలో చెప్పిన విషయాలపై చంద్రబాబు ఆ విధంగా స్పందించారు.

ప్రజలు అంత నీచంగా ఉన్నారా

ప్రజలు అంత నీచంగా ఉన్నారా


ఐదో బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి కనిపించలేదని, దానిబట్టి రాష్ట్రం పట్ల బిజెపికి ఎంత పట్టింపు ఉందో తెలుసుకోవచ్చునని చంద్రబాబు అన్నారు. చివరి వరకు పోరాటం చేస్తామని చెప్పి పోరాటం చేశామని అన్నారు. కనీసం మాట్లాడలేదని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటే కన్నడ, తమిళ ఆత్మగౌరవాలు ఉంటాయని మాట్లాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంత నీచంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

ఆత్మగౌరవం కోసం పోరాటం..

ఆత్మగౌరవం కోసం పోరాటం..

తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ సర్వం త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చారని, తాము ఆత్మగౌరవం కోసం పోరాడితే తప్పేమిటని చంద్రబాబు అన్నారు. మీ వద్ద లెక్కలున్నాయి, మా వద్ద లెక్కలున్నాయని అన్నారు. ఇవి ఇచ్చాం, ఇవి ఇస్తామని చెప్పకుండా ఏకపక్షంగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెసు అన్యాయం చేసిందని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. అన్యాయంచ చేశారని కాంగ్రెసును ఓడించారని అన్నారు. సెంటిమెంటు కాదని, ఆవేదన అని అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu retaliated BJP national president Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X