విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, పవన్ కుట్రలు: ‘కత్తి దాడి’పై చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి ఘటనపైనా స్పందించారు. కేసీఆర్‌కే మెచ్యూరిటీ ఉందా? నాకు లేదా?: మోడీపై చంద్రబాబు నిప్పులు

జగన్‌పై అభిమాని దాడి చేస్తే మమ్మల్నంటారా?

జగన్‌పై అభిమాని దాడి చేస్తే మమ్మల్నంటారా?

‘విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేతపై ఓ వ్యక్తి చిన్న కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాం. సీఐఎస్ఐ ఆధీనంలోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో మాకు సంబంధం లేదు. నిందితుడు రాసిన 10పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని. అయితే బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఏంటి?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

బాధ్యత లేకుండా జగన్..

బాధ్యత లేకుండా జగన్..

‘దాడి జరిగిన తర్వాత ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. జగన్మోహన్ రెడ్డి నేరుగా విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడే చికిత్స తీసుకున్నారు. జగన్ బాధ్యత లేకుండా వ్యవహరించారు' అని చంద్రబాబు మండిపడ్డారు.

మాపై విమర్శలా?

మాపై విమర్శలా?

‘జగన్‌పై దాడి జరిగితే ఏపీ డీజీపీని గవర్నర్ ఎలా నివేదిక అడుగుతారు? బీజేపీ నేతలు జీవీఎల్, కన్నా లాంటి వారు తమ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం' అని చంద్రబాబు ప్రశ్నించారు.

<strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్</strong>ఏపీపై కుట్రలు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారు: ఢిల్లీలో కేంద్రంపై చంద్రబాబు ఫైర్

బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, పవన్ కుట్రలు

బీజేపీతో కలిసి జగన్, కేసీఆర్, పవన్ కుట్రలు

ఏపీలో వైసీపీతో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. అంతేగాక, తెలంగాణలో కేసీఆర్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో కలిసి తమపై కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తాను కేంద్రంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరిన్ని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని అన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Satureday responded on attack on YS Jaganmohan Reddy issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X