అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వినూత్నంగా: అంతర్జాతీయ ఆర్కిటెక్‌లకు అమరావతి డిజైన్ బాధ్యత

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఆర్కిటెక్చర్ ఎంపికపై విజయవాడలోని గేట్ వే హోటల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. మూడు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, సిఆర్డీఏ అధికారులతో చర్చించారు.

రాజధాని ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల నిర్మాణ డిజైన్లు రూపొందించే బాధ్యత అంతర్జాతీయ ఆర్కిటెక్‌లకు అప్పగించాలని నిర్ణయించారు. ఫైనల్ డిజైన్ల ఎంపికకు ఐదుగురు సభ్యులతో జ్యూరీ ఏర్పాటు చేశారు. సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ వినూత్నంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu review on Amaravati final master plan

అమరావతి సంస్కృతి ప్రతిబింభించేలా: అజయ్

అమరావతి వైభవం, సంస్కృతి ప్రతిబింభించేలా రాజధాని నగరాన్ని నిర్మిస్తామని సీఆర్డీఏ కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. జూన్ నుంచి నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్దండరాయునిపాలెంలోని 500 ఎకరాల్లో అన్ని కాంప్లెక్సులు ఒకేచోట ఉండేలా డిజైన్ రూపొందించామన్నారు.

అమరావతి ఆర్కిటెక్చర్ ఎంపిక పైన గేట్ వే హోటల్లో మూడు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమై చర్చించారు. ఫిబ్రవరి చివరి నాటికి ఫైనల్ డిజన్ ఖరారు చేస్తామని, జూన్ నుంచి భవన నిర్మాణాలు ప్రారంభిస్తామని అజయ్ జైన్ తెలిపారు.

కాగా, ప్రపంచస్థాయిలో రాజధఆని అమరావతిని నిర్మించేందుకు వీలుగా దాని ఫైనల్ మాస్టర్ ప్లానులో పొందుపర్చాల్సిన అంశాలపై గురువారం చర్చించారు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో వారి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

కువైట్‌ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కువైట్‌ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై కువైట్‌ ప్రతినిధులతో సీఎం చర్చించారు.

English summary
AP CM Chandrababu Naidu review on Amaravati final master plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X