వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల కుటుంబానికి బంపర్ ఆఫర్ ఇస్తూ చంద్రబాబు ప్రకటన .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

పరిటాల కుటుంబానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పదవి కట్టబెట్టారు. ఒక పక్క పరిటాల కుటుంబం కూడా పక్క చూపులు చూస్తుందని పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ చంద్రబాబు వారికి బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీ మారే ఆలోచనకు చెక్ పెట్టారు . మంగళవారం అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటకు వెళ్ళిన చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పరిటాల కుటుంబానికి ఇచ్చిన అవకాశం గురించి ప్రకటన చేశారు .

ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన

ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన

ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికే అప్పగిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాప్తాడు, ధర్మవరం రెండు నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబానికే కేటాయిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అయితే ఇందులో పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఎవరు ఎక్కడ బాధ్యతలు తీసుకుంటారో వారి నిర్ణయానికే వదిలేస్తున్నానని పేర్కొన్నారు చంద్రబాబు .కార్యకర్తల సమక్షంలోనే ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో పరిటాల వర్గంలో సంతోషం నెలకొంది.

వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో చంద్రబాబు నిర్ణయం

వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో చంద్రబాబు నిర్ణయం

పరిటాల సునీత కుటుంబ సభ్యులతో చర్చించి ఎవరు ఎక్కడ ఇన్‌చార్జిగా ఉండాలో తెలియజేస్తామని చెప్పడంతో ధర్మవరానికి వారిరువురిలో ఎవరు బాధ్యత వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి టీడీపీని వీడి బీజేపీలో చేరడంతో చంద్రబాబు పరిటాల కుటుంబానికి ఈ అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ధర్మవరం నాయకులతో సమావేశమైన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధర్మవరంలో పరిటాల కుటుంబానికే నియోజకవర్గం బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. ఇప్పటి నుంచే పరిటాల కుటుంబానికి ధర్మవరం నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

పరిటాల కుటుంబాన్ని బీజేపీ లో చేర్చుకునే ఎత్తుగడకు చంద్రబాబు చెక్

పరిటాల కుటుంబాన్ని బీజేపీ లో చేర్చుకునే ఎత్తుగడకు చంద్రబాబు చెక్

రాబోయే ఎన్నికల నాటికి ధర్మవరంలో పార్టీ బాగా పుంజుకునేలా పని చేస్తారని చంద్రబాబు ఈ అవకాశం సునీత కుటుంబానికి ఇచ్చారు. ఒక పక్క పరిటాల ఫ్యామిలీ కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని వార్తల నేపధ్యంలో కూడా పరిటాల ఫ్యామిలీకి రాప్తాడుతో పాటు ధర్మవరం సీటు బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ కుటుంబం బీజేపీ వైపు చూడకుండా చెయ్యొచ్చని చంద్రబాబు ప్లాన్ .ఇక చంద్రబాబు నిర్ణయంపై పరిటాల సునీత మాట్లాడుతూ ఓ నాయకుడు ఇదే ధర్మవరంలో తాము మాట్లాడటానికి కూడా అవకాశమివ్వలేదని, అదే వ్యక్తి పార్టీని వీడి వెళ్లాడన్నారు. వరదాపురం సూరిపై విమర్శలు గుప్పించారు .అయితే కొందరు వస్తుంటారు, పోతుంటారని, వారి గురించి పట్టించుకోనవసరం లేదన్నా రు సునీత . చంద్రన్న మాటే శిరోధార్యమని పరిటాల సునీత పేర్కొన్నారు . మా కుటుం బ సభ్యులందరితోనూ చర్చించి ఇన్‌చార్జిగా ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుంటామని అది చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు.

English summary
Chandrababu plans to keep the Dharmavaram in charge to Paritala family . BJP is making efforts for the paritala family to defect into BJP . TDP chief Chandrababu said that Rapthadu and Dharmavaram were allocating the responsibility of two constituencies to the family of Paritala.However, Chandrababu said Paritala Sunita and Paritala Shriram have to take decision of who will take in charge. .He announced his decision in the presence of the activists. This has brought happiness to the paritala followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X