వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోరువిప్పిన లక్ష్మీపార్వతి .. లైంగిక వేధింపుల ఆరోపణలు చంద్రబాబు కుట్రేనన్న లక్ష్మీపార్వతి

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నికల సమయంలో అనూహ్యంగా వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి లైంగిక వేధింపుల ఆరోపణలో చిక్కుకున్నారు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధిస్తున్నారని , తనకు వైసీపీ నాయకుల నుండి, లక్ష్మీపార్వతి నుండి రక్షణ కావాలని కోటి అనే వ్యక్తి వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన ఈ వివాదంపై లక్ష్మీపార్వతి తాజాగా నోరు విప్పారు. ఇదంతా చంద్రబాబు కుట్రని ఆరోపించారు. తనపై ఇలాంటి ఆరోపణలు చేసి ప్రచారంలో పాల్గొనకుండా చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ అని ఆమెఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చాక తానేంటో చూపిస్తానని.. అందరి భరతం పడతానని అన్నారు లక్ష్మీపార్వతి . పక్కా ప్రణాళికతో కోటి అనేవాడిని తన ఇంటికి పంపి ఈ నాటకమంతా ఆడించారని ఆమె ఆరోపించారు.

లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్

 తనపై వచ్చిన ఆరోపణలు చంద్రబాబు కుట్ర

తనపై వచ్చిన ఆరోపణలు చంద్రబాబు కుట్ర

లైంగిక వేధింపుల ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయన్న లక్ష్మీపార్వతి పక్కా ప్లాన్ తో కోటి అనేవాడిని తన ఇంటికి పంపి ఇంత డ్రామా ఆడుతున్నారని ఆమె ఆరోపించారు .తనపై వచ్చిన అసత్య ఆరోపణల విషయంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఒక సినిమా డైరెక్టర్ ఈ కోటిని తన ఇంటికి తెచ్చారని చెప్పిన లక్ష్మీపార్వతి తనది గుంటూరు జిల్లా వినుకొండ అని చెప్పాడని చెప్పుకొచ్చారు. తానూ చేసిన అతిపెద్ద తప్పు ఇంటికొచ్చిన మనిషిని సాదరంగా ఆహ్వానించడమే అని ఆమె చెప్పుకొచ్చారు . తనకేదైనా ఉద్యోగం చూపించమని కోటి ప్రాదేయపద్దాడని చెప్పిన ఆమె ఇదంతా బాబు కుట్రే అని తేల్చి చెప్తున్నారు . అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడని , ప్రతి నెలా తన తల్లి కోసం మందులు తెచ్చి ఇచ్చేవాడని చెప్పారు. అంతకుమించి అతనితో తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు లక్ష్మీ పార్వతి .

కోటి మా ఇంటికి రావటం ...ఇప్పుడీ కథ చెప్పటం అంతా పక్కా ప్లాన్

కోటి మా ఇంటికి రావటం ...ఇప్పుడీ కథ చెప్పటం అంతా పక్కా ప్లాన్

కుట్రపూరితంగానే చంద్రబాబు కోటిని తన ఇంటికి పంపించి ఇలాంటి ఆరోపణలు చేయించారని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అందరి పని పడతానన్నారు. ఎన్టీఆర్ గౌరవం పోరాదన్న ఉద్దేశంతో తాను నిశ్శబ్దంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. రాజకీయాలకోసం ఇంత దిగజారుడుతనం పనికి రాదనీ ఆమె చంద్రబాబుపై మండిపడ్డారు .

నోరు విప్పితే చంద్రబాబు , బాలయ్య కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించిన లక్ష్మీపార్వతి

నోరు విప్పితే చంద్రబాబు , బాలయ్య కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించిన లక్ష్మీపార్వతి

తాను కనుక ఒక్కసారి నోరు విప్పితే చంద్రబాబు బాలకృష్ణ కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తరువాత ప్రజల్లో తనపట్ల గౌరవం మరింత పెరిగిందే కానీ ఏమాత్రం తగ్గలేదని లక్ష్మీపార్వతి అన్నారు. తనపట్ల గౌరవం తగ్గించాలని ఎన్ని కుట్రలు చేసినా అది సాధ్యం కాదన్న లక్ష్మీపార్వతి ఓటమి భయమే చంద్రబాబుతో ఇంతా చేయిస్తుంది అని మండిపడ్డారు. మరో వైపు ఈ వ్యవహారంలో వైసీపీ నాయకులు కూడా లక్ష్మీ పార్వతి పక్షాన నిలిచారు.

లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితా రాజశేఖర్

లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితా రాజశేఖర్

ఓటమి భరించలేక తెలుగుదేశం పార్టీ లక్ష్మి పార్వతిపై లేనిపోని అభాండాలు వేస్తున్నదని సినిమా నటుడు..వైసీపీ నేత రాజశేఖర్ మండిపడ్డారు . తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై జీవితా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. ఏ ఛానల్ చూసిన దీని గురించే చర్చ చేస్తున్నారంటూ వాస్తవాలు తెలీకుండా ఎలాపడితే అలా మహిళల మీద ఎలా వార్తలు వేస్తారంటూ జీవితా రాజశేఖర్ ఈ వార్తలపై ఘాటుగా స్పందించారు. లక్ష్మీపార్వతిపై అనవసరంగా నిందలు మోపుతున్నారని .. దీనివెనుక పెద్ద కుట్ర ఉందని జీవితారాజశేఖర్ మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేయిస్తున్నారని జీవితా రాజశేఖర్ అన్నారు.

English summary
Sexual harassment case has been filed on YCP leader Lakshmi Parvathi. A man identified as Koti registered a case on Lakshmi Parvathi alleging that she has been harassing him and has been approaching him inappropriately. On his allegations Lakshmiparvathi spoke to the media on this . this is nothing but a political grudge . chandrababu planned this and Koti implemented this . She alleged that Chandrababu is doing all these politics on her because of his downfall in this election . She warned she will take legal action on this issue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X