వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పదు!..'ఎన్టీఆర్' సినిమాలో సీన్లు మళ్లీ మార్చాల్సిందే:చంద్రబాబు తాజా నిర్ణయంతో బాలయ్య తిప్పలు

|
Google Oneindia TeluguNews

అమరావతి:ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసమనే నినాదంతో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు సై అన్న సంగతి తెలిసిందే. ఉరుమురిమి మంగలం మీద పడినట్లు చంద్ర‌బాబు తాజా నిర్ణ‌యం అటు ఎపి రాజకీయాల మీదే కాకుండా బాలయ్య 'ఎన్టీఆర్' సినిమా మీద కూడా పడినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతే ఆవలంబనగా చేసుకొని తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే విజయభేరి మోగించిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలోనూ చరిత్ర సృష్టించారు. మహా నటుడి నుంచి మహా నేతగా ఎదిగిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆధారం చేసుకొని ఆయన తనయుడు బాలకృష్ణ 'ఎన్టీఆర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలన్న చంద్రబాబు నిర్ణయం ఎఫెక్ట్ బాలకృష్ణ 'ఎన్టీఆర్' చిత్రం మీద కూడా పడిందట. అదెలాగంటే?...

సినిమా నుంచి...రాజకీయానికి

సినిమా నుంచి...రాజకీయానికి

సినీ ,రాజకీయ రంగాల్లో సంచలనంగా సృష్టించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగానే ఆయన తనయుడు బాలకృష్ణ రూపొందిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రానికి కొత్త ఇబ్బంది వచ్చిపడింది. ఢిల్లీ పాలకులు చెప్పినట్లు ఇక్కడ పాలన సాగడం ఏమిటనే ఉద్దేశ్యంతో... తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు....అలా సృష్టించబడిన టిడిపి అనతికాలంలోనే విజయభేరి మోగించి చరిత్ర సృష్టించింది. అయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలనుకున్న టిడిపి అధినేత చంద్రబాబు తాజా నిర్ణయం ఇప్పుడు బాలకృష్ణ 'ఎన్టీఆర్' సినిమాకు తిప్పలు తెచ్చిపెట్టిందంటున్నారు.

తేజ నుంచి క్రిష్ చేతికి

తేజ నుంచి క్రిష్ చేతికి

'ఎన్టీఆర్' సినిమా తొలుత తేజ దర్శకత్వంలో ప్రారంభం కాగా సినిమా ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలి, కథా గమనం తదిదర విషయాల్లో తేడాలు రావడంతో తేజ ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలను క్రిష్ చేపట్టగా ఆ క్రమంలో రాజకీయ రంగం ప్రస్థావన తక్కువగా...సినీ ప్రస్థానమే ఎక్కువగా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఏదిఏమైనా టిడిపిని స్థాపించింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కావడంతో అదే విషయం చూచాయగా సినిమాలో ఉందంటున్నారు.

చంద్రబాబు...తాజా నిర్ణయం...ప్రభావం

చంద్రబాబు...తాజా నిర్ణయం...ప్రభావం

ఆ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు ఢిల్లీ వెళ్లి మరీ ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి అదే విషయాన్ని జాతీయ మీడియా ఎదుట ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తదనుగుణంగా బాలకృష్ణ 'ఎన్టీఆర్' సినిమాలో మార్పులు చేయాల్సివుందట.

మార్పులు...చేస్తారట

మార్పులు...చేస్తారట

సినిమాలో పార్టీ ఆవిర్భావం సందర్భంలో కాంగ్రెస్ పై మరీ ఘాటు విమర్శలు, తీవ్ర వ్యతిరేకత చూపకుండా ప్రస్తుతం చంద్రబాబు మనోభావాలు,టిడిపి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించారట. దీంతో ఇప్పటికే దర్శకుడు మారి స్క్రిప్ట్ లో మార్పులకు గురైన 'ఎన్టీఆర్' ఇప్పుడు మరోసారి అదే బాట పట్టనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

English summary
Amaravathi:Chandrababu's latest decision has showing impact not only telugu politics but also Balakrishna's NTR movie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X