వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ వెనుక ఎవరున్నారంటే 'దేవుడు' అన్న గంగిరెడ్డి, మారిషస్ నుంచి ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఆదివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అరెస్టు తదితరాలపై గంగిరెడ్డి వేదాంత ధోరణిలో స్పందించాడు. అన్నింటికీ దేవుడే ఉన్నాడని వ్యాఖ్యానించాడు. 'మీ వెనుక ఎవరున్నారు?' అని విలేకరులు అడిగితే దేవుడే ఉన్నాడన్నాడు.

ప్రస్తుతం తన టైం బాగోలేదని, చంద్రబాబు నాయుడు పైన జరిగిన హత్యాయత్నం కేసుతో తనకు సంబంధం లేదన్నాడు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రాణహాని లేదన్నాడు.

కడప సెంట్రల్ జైలుకు గంగిరెడ్డి

మారిషస్ నుంచి తరలించిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కడప జిల్లా పోలీసులు జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. తొలుత హైదరాబాద్ నుంచి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ గంగిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ఆరో ఏడిజె న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి గంగిరెడ్డికి 14 రోజుల రిమాండు విధించారు. దీంతో గంగిరెడ్డిని పోలీసులు కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.

తద్వారా, ఏడాదిన్నరకు పైగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న గంగిరెడ్డి ఎట్టకేలకు మళ్లీ జైల్లోకి చేరాడు. ఇటీవల మారిషస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, నెలల తరబడి అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన ఏపీ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అతడిని హైదరాబాద్, అక్కడి నుంచి కడపకు తీసుకు వచ్చారు.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఆదివారం నాడు ఉదయం ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు.

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఆదివారం నాడు ఉదయం ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. మారిషస్ నుంచి తీసుకువస్తూ...

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఆదివారం నాడు ఉదయం ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు. మారిషస్ నుంచి తీసుకువస్తూ...

గంగిరెడ్డి

గంగిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని ఆదివారం నాడు ఉదయం ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చారు.

English summary
"My luck has run out and I am caught" -- was how the 'most wanted' red sanders smuggler Kollam Gangi Reddy reacted when he spoke to the media here on Sunday, hours after his extradition from Mauritius.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X