వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కొత్త ప్రచారం.. మీ ఓటు నాకా జగన్ నేరాలకా ?

|
Google Oneindia TeluguNews

ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. పొలిటికల్ హీట్ పీక్స్ చేరుతున్న సమయంలో ఆయన సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు . మరో మూడు రోజులే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఆయన ప్రతిపక్ష నాయకుడైన జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లాలంటే వెరిఫికేషన్ చేస్తారని, మరి 31 కేసులున్న జగన్ విదేశాలకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు . ఎలక్షన్ మిషన్ 2019లో భాగంగా ఆదివారం అమరావతిలో పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ మేనిఫెస్టో పై సంచలన ఆరోపణలు చేశారు .సంపద సృష్టి గురించి వైసీపీ మేనిఫెస్టోలో ప్రస్తావించలేదని, రాజధాని, నదుల అనుసంధానం గురించి జగన్ చెప్పలేదని సీఎం విమర్శించారు. అంతే కాదు జగన్ మ్యానిఫెస్టో ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనం అన్నారు .

<strong>అధికారుల బదిలీలెందుకు .. చంద్రబాబునే చంపెయ్యండి .. శివాజీ సంచలనం</strong>అధికారుల బదిలీలెందుకు .. చంద్రబాబునే చంపెయ్యండి .. శివాజీ సంచలనం

జగన్ మ్యానిఫెస్టో చూస్తే అవగాహనా రాహిత్యం అర్ధం అవుతుంది అన్న బాబు

జగన్ మ్యానిఫెస్టో చూస్తే అవగాహనా రాహిత్యం అర్ధం అవుతుంది అన్న బాబు

ఇక జగన్ ను ఎవరు నమ్ముతారో చెప్పాలని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి, జిల్లాలు, మండలాలు పారిశ్రామికీకరణపై జగన్‌కు అవగాహన లేదని చంద్రబాబు మండిపాటుకు గురయ్యారు . ఇన్ని నేరాలు ఉన్న వ్యక్తిని నమ్మి ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారా..? అని సీఎం ప్రశ్నించారు. జగన్ తో ఏది జరగదని రాష్ట్రం నాశనం అవుతుందని చంద్రబాబు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు.

మీ ఓటు నాకా . లేకా జగన్ నేరాలకా ? అంటూ ప్రచారం

మీ ఓటు నాకా . లేకా జగన్ నేరాలకా ? అంటూ ప్రచారం

టీడీపీకి వేసే ఓటు చంద్రబాబుకు ఓటుగా చెప్పాలని.. వైసీపీకి వేసే ఓటు జగన్ నేరాలకు ఓటుగా చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు టీడీపీకే వేసేలా చూడాలని నేతలకు సూచించారు. ప్రజలను సైతం చంద్రబాబు వేసే ప్రశ్న ఆలోచింపజేస్తుంది . చంద్రబాబు మీ ఓటు నాకా .. లేకా జగన్ నేరాలకా అంటూ ప్రశ్నిస్తూ ప్రచారాన్ని రసవత్తరంగా మార్చారు.

నేరగాళ్ళను నిలబెట్టిన పార్టీ వైసీపీ అన్న చంద్రబాబు ..

నేరగాళ్ళను నిలబెట్టిన పార్టీ వైసీపీ అన్న చంద్రబాబు ..

జగన్ వ్యక్తిత్వం లేని వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు తొలి ఓటు నేరాలు ఘోరాల పార్టీకి వేస్తే జీవితాంతం క్షోభ అనుభవించినట్లుగా ఉంటుందన్నారు . 97 మంది నేరగాళ్లను నిలబెట్టిన పార్టీకి ఎవరైనా ఓటేస్తారా..? అంటూ ప్రశ్నించారు . ఉద్యోగాలకు వెళ్లేవారికి క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారని, జగన్‌కు అలాంటివేవీ ఉండవని చంద్రబాబు దుయ్యబట్టారు. మొత్తానికి సరికొత్త నినాదంతో ఈ మూడు రోజుల ప్రచారం సాగించనున్నారు చంద్రబాబు . మీ ఓటు నాకా .. జగన్ నేరాలకా అంటూ బాబు చేసే ప్రచారం చంద్రబాబుకు ఓట్లను రాలుస్తుందో లేదో వేచి చూడాలి.

English summary
Vote to TDP counts Vote for Chandrababu . The vote for the YCP counts vote for Jagan's crimes. The voters who will utilize their vote advised by the leaders to look at TDP. Chandrababu asked the people of Andhra you are going to vote for me or you are going to vote for the jagan's crimes . you have to decide chandrababu said .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X