వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు సొంత నియోజకవర్గంలో... వైసీపీ నేత హత్యకు కుట్ర

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు ఏపీలో వైసీపీ నేత హత్యకు కుట్రకు జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. అయితే ముఖ్యంగా ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో జరగటంతో రాజకీయంగా ఏం జరిగిందనే ఆసక్తి నెలకొంది . గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. ఇక ఆయన హత్యకు స్కెచ్ వేశారని తెలియటం స్థానికంగానూ ,అటు రాజకీయంగానూ దుమారం రేపుతుంది.

నేడు అమరావతి బంద్ .. జేఏసీ నేత సుధాకర్ పై దాడికి నిరసననేడు అమరావతి బంద్ .. జేఏసీ నేత సుధాకర్ పై దాడికి నిరసన

 విద్యా సాగర్ మర్డర్‌కు పక్కా స్కెచ్ వేసిన ప్రత్యర్ధులు

విద్యా సాగర్ మర్డర్‌కు పక్కా స్కెచ్ వేసిన ప్రత్యర్ధులు

చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ నేత విద్యాసాగర్‌ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. విద్యా సాగర్ మర్డర్‌కు పక్కా స్కెచ్ వేసిన ప్రత్యర్ధులు పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సుపారీ ఇచ్చి చంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక గణేష్ తో విద్యాసాగర్ కు రూ.10 లక్షలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా అతడికి కొంత డబ్బు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది .

 సుపారీ ఇచ్చి చంపాలనే కుట్ర .. పోలీసులకు ఫిర్యాదు

సుపారీ ఇచ్చి చంపాలనే కుట్ర .. పోలీసులకు ఫిర్యాదు

ఈ విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా విశ్వసనీయ వర్గాల వల్ల తెలుసుకున్న విద్యాసాగర్ తనపై జరుగుతున్న కుట్రను కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో పోలీసులు ఈ కుట్రపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ హత్యకు అసలు కుట్రదారులు ఎవరు అన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు.స్కెచ్ గీసిన దుండగుల కోసం వారి దగ్గర నుంచి సమాచారం రాబడుతున్నారు. ఇక ఈ నేపధ్యంలో సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది.

వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేకా రాజకీయ కారణాలు ఉన్నాయా?

వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేకా రాజకీయ కారణాలు ఉన్నాయా?

ఇక విద్యా సాగర్ హత్యకు వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? లేకా రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది .ఇక గత ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిపోవడంలో విద్యాసాగర్ కీలక భూమిక పోషించినట్టు తెలుస్తోంది.తనకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన రామకుప్పం మండలంలో చంద్రబాబు మెజారిటీని 8,300 నుంచీ 3400కు తగ్గించారు.

 చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంతో హాట్ టాపిక్

చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంతో హాట్ టాపిక్

ఇక అన్నిటికంటే కుప్పం నియోజకవర్గం ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కావడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. విద్యాసాగర్ గత ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీ తీర్థం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం చాలా కష్టపడ్డారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన హత్యకు కుట్ర అందుకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

English summary
The news that the YCP leader's conspiracy to murder in AP has now become a sensation. In particular, it was interesting to see what happened in Chandrababu's own constituency, Kuppam. Vidyasagar, who formerly worked in TDP, is now in YCP. The sketch of his assassination is known locally and politically hot topic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X