వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుది ఐరన్ లెగ్ ... ఆయన సీఎంగా ఉంటే వర్షాలు పడ్డాయా : మంత్రి అనిల్ ఫైర్

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వర్షాలు,వరదలపై ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని చంద్రబాబు ఆరోపణలు గుప్పించడం సరైంది కాదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కరకట్టపై అక్రమ నివాసంలో ఉంటున్న అక్రమ నేత చంద్రబాబు ముందు ఇంటిని ఖాళీ చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.

ఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖఏపీలో వర్ష బీభత్సం .. తక్షణం ఆదుకోవాలని సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ

 చంద్రబాబు కరకట్ట మీద ఇంటిని ఖాళీ చెయ్యాలని మంత్రి డిమాండ్

చంద్రబాబు కరకట్ట మీద ఇంటిని ఖాళీ చెయ్యాలని మంత్రి డిమాండ్

శుక్రవారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అక్రమంగా కరకట్ట మీద ఇళ్ళు కట్టుకుని, ప్రమాదమని ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా చంద్రబాబు ఇంతవరకు ఇల్లు ఖాళీ చేయలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదు అని చంద్రబాబు అంటున్నారని ఫైర్ అయిన మంత్రి అనిల్ 1998 వరదల్లో శ్రీశైలం పవర్ హౌస్ ను ముంచింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేష్ లు ఏపీకి టూరిస్టుల్లా వచ్చిపోతున్నారు

చంద్రబాబు, లోకేష్ లు ఏపీకి టూరిస్టుల్లా వచ్చిపోతున్నారు

చంద్రబాబు ,నారా లోకేష్ రాష్ట్రానికి టూరిస్టుల్లా వచ్చిపోతున్నారని విమర్శలు గుప్పించిన అనిల్ కుమార్ యాదవ్, చంద్రబాబు హయాంలో ఎప్పుడూ వర్షాలు కురవలేదని, ఆయన పాలనలో కరువు తాండవించింది అని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తుఫాన్లు వచ్చి రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. వర్షాలు వరదలపై ప్రస్తుత ప్రభుత్వం చాలా అప్రమత్తంగా పని చేస్తోందని స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

చంద్రబాబు తప్పిదాల వల్లే హైదరాబాద్ లో కూడా వరదలు

చంద్రబాబు తప్పిదాల వల్లే హైదరాబాద్ లో కూడా వరదలు

కృష్ణానదికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో తక్షణం చంద్రబాబు నాయుడు ఇంటిని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు . చంద్రబాబు తప్పిదాల కారణంగా హైదరాబాద్లో కూడా వరదలు ముంచేస్తున్నాయి అని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అనిల్. రాష్ట్రాన్ని కాపాడాలి అంటున్న చంద్రబాబు తన పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు కాపాడుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.

 రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే దేవుడు కూడా సహకరిస్తున్నాడు

రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే దేవుడు కూడా సహకరిస్తున్నాడు

తమది రైతు పక్షపాత ప్రభుత్వం కాబట్టే దేవుడు కూడా సహకరిస్తున్నాడంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబుది ఐరన్ లెగ్ అని 14 ఏళ్ళు సీఎం గా ఉంటే ఏనాడైనా వర్షాలు పడ్డాయా ? అని ప్రశ్నించిన మంత్రి అనిల్ తాను సీఎంగా ఉంటే అలా చేసే వాడిని ఇలా చేసే వాడిని అని చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. రైతులను పట్టించుకోవటం లేదంటూ చెంద్రబాబు విమర్శలు చెయ్యటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు .

English summary
Minister Anil Kumar Yadav outraged over TDP chief Chandrababu. Minister Anil Kumar Yadav said it was not right for Chandrababu to accuse the government of not taking any relief measures on rains and floods in the state. Anil Kumar Yadav demanded that the house be vacated in front of illegal leader Chandrababu, who was staying at an illegal residence on the embankment. He said there was no rain in the state during Chandrababu's reign and the drought was over.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X