• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెనక్కు తగ్గని చంద్రబాబు ... రేపు హస్తిన వేదికగా ధర్నా.. ఎందుకంటే

|

ఎన్నికల సమరం ముగిసింది . పలు జాతీయ సర్వేల సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చేశాయి. ఒకటి రెండు సంస్థలు మినహాయించి మిగతా అన్ని సంస్థలు ఏపీలో వైసీపీదే విజయం అని తేల్చి చెప్పాయి. ఇక కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌ వెల్లడించాయి. ఈ తరుణంలో చంద్రబాబునాయడుు మరోసారి ఢిల్లీ పర్యటన చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. ఏ మాత్రం వెనుకంజ వెయ్యకుండా ఏపీ సీఎం చంద్రబాబు సమరానికి సై అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ .. పసుపు కుంకుమ పథకంపై సెటైర్లు .. పసుపు బాబుకు రాసి బొట్టు జగన్ కు పెట్టారట

సోమవారం నాడు మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగాల్ సీఎంత మమత బెనర్జీతో భేటీ కానున్నారు. ఎగ్జిట్ పోల్స్ నేపధ్యంలో భవిష్యత్ ప్రణాళికపై ఆమెతో చర్చించేందుకు అమరావతి నుండి చంద్రబాబునాయుడు సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బెంగాల్ వెళ్లనున్నారు. మంగళవారం నాడు విపక్ష పార్టీలతో భేటీ కానున్నారు. హస్తిన వేదికగా ఎన్నికల సంఘంపై , కేంద్ర సర్కార్ పై పోరుకు సిద్ధం కావాలని, అందరూ కలిసి రావాలని చంద్రబాబు విపక్ష పార్టీలను కోరనున్నారు.

Chandrababus struggle.. he decided to proetst at Delhi .. why because

దేశరాజధాని ఢిల్లీలో మరోసారి ధర్నా చెయ్యాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం తీరు, ఈవీఎంల పనితీరు, వీవీ ప్యాట్ల లెక్కింపు వంటి అంశాలపై నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదాస్పదం చేసిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అందరినీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం చంద్రబాబు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతటి ఇబ్బంది కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు ఏ మాత్రం వెనకడుగు వెయ్యకుండా పోరుబాట పట్టారు.

English summary
AP Chief Minister Chandrababu Naidu decided to protest once again in the national capital Delhi. On Tuesday afternoon, it was announced that all parties should come to Delhi to protest. They decided to protest against the public election campaign and the performance of EVMs, VV PAT's counting. The Election commission made these elections verycontroversial, and are allegated that they have misused their powers . Prime Minister Narendra Modi is blamed for blackmailing everyone . Chandrababu announced this statement after conducting teleconference this morning with TDP leaders. Even in this tough situations Chandrababu is struggling to face it courageously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more