• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ -టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్‌ దిక్కు -జగన్ మాటే ఫైనల్: మంత్రి బాలినేని

|

రెండేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజం ఎదరైనప్పటికీ, సవాళ్లు తనకు కొత్త కాదంటూ ఎదురు నిలిచారు టీడీపీ అధినేత చంద్రబాబు. గడిచిన రెండేళ్లుగా వైసీపీ సర్కారుపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై తనదైన శైలిలో పోరాడుతూనే ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి మద్దతు రాకపోవడం, ఆ మధ్య పంచాయితీ ఎన్నికలు, నిన్నటి మున్సిపాలిటీ ఎన్నికల్లో చంద్రబాబు పూర్తిగా చతికిల పడిన నేపథ్యంలో టీడీపీ భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో..

ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్న ys shamila అనూహ్య వ్యాఖ్యలు -యుద్ధం -కుక్కలు మొరుగుతాయ్ -గుండె అలిసిందన్న ఏపూరి సోమన్న

టీడీపీలో నాయకత్వ మార్పు

టీడీపీలో నాయకత్వ మార్పు


టీడీపీ మనుగడపై పార్టీ శ్రేణుల నుంచి ప్రత్యర్థుల దాకా చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల బాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులే కొత్త నాయకత్వం కోసం నినాదాలు చేయడం, జూనియర్ ఎన్టీఆర్ కు పగ్గాలు అప్పగించాలని, ప్రచారానికి తేవాలని డిమాండ్లు చేయడం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కోసం అభిమానులు నినాదాలు చేస్తున్నసేపూ చంద్రబాబు మౌనం వహించారు. తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం చంద్రబాబు పని ఖతమైందని, టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కని వ్యాఖ్యానించారు.

కోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలుకోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలు

టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు

టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు


‘‘చంద్రబాబు చరిత్ర ముగిసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఏపీలోనూ టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. కాస్తయినా టీడీపీ నిలదొక్కుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తప్ప ఆ పార్టీకి మరో దిక్కు లేదు. నారా లోకేశ్ వల్ల పార్టీకి ఎలాంటి లాభం లేదని అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు, లోకేశ్ కారణంగా టీడీపీ ఘోరంగా పతనమైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలూ వీడిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాకతో ఏమైనా మెరుగుపడొచ్చు. అదీగాక..

చంద్రబాబు మోసం బట్టబయలు

చంద్రబాబు మోసం బట్టబయలు

టీడపీ అధినేత మోసకారి తనాన్ని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే గుంటూరు, కృష్టా ప్రాంతంలో చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేశారని స్థానికులకు అర్థమైంది. అందుకే టీడీపీ కుయుక్తులకు గట్టిగా బుద్ధి చెప్పారు. రాజధాని ప్రాంతంలో జనం వైసీపీకి బ్రహ్మరధం పట్టారు. రెబల్స్ గా గెలిచిన వాళ్లను కూడా వైసీపీ అభ్యర్థులుగానే గుర్తిస్తాం. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల విషయంలో సీఎం జగన్ మాటే ఫైనల్. అందరూ ఆయన ఆదేశాలను పాటించాల్సిందే'' అని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.

English summary
'chandrababu political era and history was over, now junior ntr is the only hope that tdp had' says andhra pradesh power minister balineni srinivasa reddy. reacting on the muncipal elections result minister made these comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X