వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే ఊహాహ్మక ప్రశ్నలు వద్దన్న చంద్రబాబు .. ఇంకేమన్నారంటే !

|
Google Oneindia TeluguNews

మే 23 రిజల్ట్స్ డే .. దగ్గర పడుతుంటే జాతీయ రాజకీయ పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే సమయంలో జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ యేతర కూటమి కోసం 22 పార్టీలను ఏకం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్డీయే సర్కార్ గద్దె దిగటం ఖయాం అని చెప్పిన చంద్రబాబు మారుతున్న తాజా పరిణామాలపై తనదైన స్పందన తెలియజేశారు.

సోనియా గాంధీ పిలుపు చంద్రబాబుకు అందిందా అంటే చిరునవ్వుతో సమాధానం చెప్పిన బాబు

సోనియా గాంధీ పిలుపు చంద్రబాబుకు అందిందా అంటే చిరునవ్వుతో సమాధానం చెప్పిన బాబు

ఒక పక్క యూపీఏ కూటమికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారంటూ వార్తలు వస్తున్నాయి. సోనియాగాంధీ మే 23 న సమావేశం నిర్వహించనున్నారని ,తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లను యూపీఏ కూటమికి మద్దతు పలకాలంటూ కోరారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పరిణామాన్ని ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ పిలుపు చంద్రబాబుకు అందిందా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా చంద్రబాబు చిరునవ్వుతో ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

చివరిదశ ఎన్నికల తర్వాత భేటీ ఉంటుందన్న బాబు.. మే 23 సోనియా సమావేశం పై డైలమా

చివరిదశ ఎన్నికల తర్వాత భేటీ ఉంటుందన్న బాబు.. మే 23 సోనియా సమావేశం పై డైలమా

అన్నింటికి సమాధానం చెప్తానని ఇక్కడే ఉంటారు కదా అని దాటవేసిన చంద్రబాబు యూపీఏ కూటమి అజెండాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కానీ సోనియా గాంధీ ఆహ్వానం అంశం గానీ, మే 23 సమావేశం ప్రస్తావన కానీ ఎక్కడా తీసుకురాలేదు. అంతే కాదు చివరి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలంతా బిజీబిజీగా గడుపుతున్నారని ఎన్నికల అనంతరం అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలను బట్టి మే 23 సోనియా సమావేశం పై ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది అని అర్ధం అవుతుంది . ఒకవేళ ఉంటె అందులో ఎన్ని పార్టీలు పాల్గొంటాయి అన్నది కూడా ఆసక్తికరమే.

టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే ఊహాత్మక ప్రశ్నలు వద్దన్న బాబు

టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే ఊహాత్మక ప్రశ్నలు వద్దన్న బాబు

ఇక చివరి దశ ఎన్నికల అనంతరం రాజకీయ అజెండా రూపొందిస్తామని తెలిపారు చంద్రబాబు . ఈ సందర్భంగా బీజేపీయేతర కూటమిలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దన్నారు చంద్రబాబు . అయినా ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. బీజేపీయేతర కూటమికి ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అది ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు. ఒకపక్క కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశంలో చక్రం తిప్పుతుంది, అధికారం ఫెడరల్ ఫ్రంట్ దేనని అవసరమైతే బయట నుండి కాంగ్రెస్ మద్దతు కోరతామని చెప్తుంటే కేసీఆర్ బీజేపీయేతర కూటమికి మద్దతు పలకటం సాధ్యం కాని అంశమే అని భావించే చంద్రబాబు ఊహాత్మక ప్రశ్నలు అన్నారని భావించొచ్చు. ఒకవేళ అలా నిజంగా బీజేపీయేతర కూటమికి మద్దతిస్తే స్వాగతిస్తామని చెప్పారు.

English summary
Chandrababu had asked too much questions by reporters whether he would work with TRS in the Non-BJP Alliance in the wake of the latest political developments where he replied to them saying that not to ask imaginatory questions . Chandrababu made it clear that they did not have the need for discrimination against a party. It is clear that whoever will join the Non-BJP Alliance is welcomed and that may be any party. On the other hand, the KCR's federal front is revoloving in the country , if Congress wants support from the outside of the federal front, Chandrababu thinks that it is not possible to support the non-BJP Alliance. In that case KCR really supports non-BJP alliance Chandrababu will be glad to welcome him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X