వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రెడ్డి కథ వేరే చెప్పనక్కరలేదు ..క్యాబినెట్ మంత్రులకు పేర్లు పెట్టి చంద్రబాబు వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ లో జరుగుతున్నపరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేడు పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, క్యాబినెట్ మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 డీజీపీకి చంద్రబాబు మరో లేఖ .. దేశంలో ఏపీ పోలీసులపైనే ఎక్కువ కేసులు ..పనితీరుకు ఇదే అద్దం అంటూ డీజీపీకి చంద్రబాబు మరో లేఖ .. దేశంలో ఏపీ పోలీసులపైనే ఎక్కువ కేసులు ..పనితీరుకు ఇదే అద్దం అంటూ

 వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే విధ్వంసాలా ?

వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే విధ్వంసాలా ?

వైసిపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు విధ్వంసాలకు దిగుతారా అంటూ ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
జగన్ క్యాబినెట్ లో ఒకరు బూతుల మంత్రి, ఒకరు హవాలా మంత్రి, ఇంకొకరు బెంజ్ మినిస్టర్ అని చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గానీ, పార్టీని గానీ తానెప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు.

 టీడీపీ అనుక్షణం దుర్మార్గులతో పోరాటం చేస్తుంది

టీడీపీ అనుక్షణం దుర్మార్గులతో పోరాటం చేస్తుంది


తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అనుక్షణం దుర్మార్గులతో పోరాటం చేస్తున్నామని, అందుకే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఏపీలో పోలీసుల తీరుపై కూడా మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ఒకవైపు న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని, మరోవైపు ఎన్సిఆర్బి నివేదికలు పోలీసు వ్యవస్థపై అక్షింతలు వేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళ పై కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయని అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు, సీఎం జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టిడిపి నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు ఆగటం లేదు

రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు ఆగటం లేదు

రాష్ట్రంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు ఆగడం లేదని, మూడు నెలల కాలంలో మూడు జిల్లాల్లో ముగ్గురికి శిరోముండనాలు జరిగాయని, ఇది వైసీపీ దమనకాండకు పరాకాష్ట అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

టిడిపి నేత సబ్బం హరి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం ఘటనపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ని వేధించడాన్ని కూడా చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. 18 ఏళ్ల క్రితం ఘటనపై కడప టిడిపి నేత హరి ప్రసాద్ ను అరెస్ట్ చేయడం పై చంద్రబాబు మండిపడ్డారు.మాజీ మంత్రి జవహర్ పై తప్పుడు కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యనే అని చంద్రబాబు పేర్కొన్నారు.

Recommended Video

AP CM YS Jagan ఇంటి ముందు భజరంగ్ దల్ నిరసన, అరెస్ట్
 ఏపీ ప్రభుత్వ తీరు దుర్మార్గం

ఏపీ ప్రభుత్వ తీరు దుర్మార్గం


ఏపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ శ్రేణులు వైసిపి దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సమాయత్తంగా ఉండాలని, పోరాట పంథాను ఎప్పటికీ విడవద్దు అని చంద్రబాబు పార్టీ నాయకులకు తేల్చిచెప్పారు.


మాజీ సీఎం చంద్రబాబు నిత్యం పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితుల మీద ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు .

English summary
Telugu Desam party chief Chandrababu Naidu held a video conference with party leaders in the wake of the latest political developments in the state. He expressed outrage over the behavior of AP CM Jaganmohan Reddy and cabinet ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X