వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీని ఆ దేవుడే కాపాడాలి .. వైరల్ అవుతున్న వీడియో పెట్టి తాజా పరిస్థితి చెప్పిన చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో కరోనా నివారణ జరిగేలా లేదని, ప్రభుత్వ తీరుతో కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న అనుమానితులను అంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు .ఇలా చేయడం వల్ల వైరస్ లేని వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు .

 టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీలో కరోనాకేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 108 పబ్లిసిటీ కోసం చేస్తున్నారా? లేక మరిన్ని కేసులు పెంచేందుకు చేస్తున్నారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇక ఏపీని ఆ దేవుడే రక్షించాలి అంటూ ట్వీట్ చేశారు. నూతనంగా జిల్లాలకు వెళ్లిన 108 వాహనాలలో వాహనాల డోర్లు పట్టని విధంగా భారీ సంఖ్యలో కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారిని తీసుకువెళ్తున్న వీడియోను చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Chandrababu says God must protect the AP .. he tweeted the latest situation about Corona

Recommended Video

Moka Bhaskar Rao హత్య కేసులో మాజీ మంత్రి Kollu Ravindra ను అరెస్ట్ ! || Oneindia Telugu

ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో 108 కోసం వేచి చూస్తుండగా వచ్చిన 108 వాహనంలో అప్పటికే కిక్కిరిసిన అనుమానితులు ఉన్నారు. అందులో అతన్ని కూడా బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు ఏపీ ప్రజలను భగవంతుడే కాపాడాలని,ఇలా అయితే కేసులు ఎక్కువగా పెరుగుతాయని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

English summary
Former AP CM Chandrababu Naidu tweeted that Appalled to see suspected Covid -19 Patients being herded into a waiting 108 ambulance like animals leading to wider spread. If all the 108 publicity amounts to this, then I’m afraid AP Govt will fail its people as numbers mount. God save Andhra Pradesh!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X