వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైట్లీ అవమానించారు, అంత నీచంగా కనిపిస్తున్నారా: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెసు కన్నా బిజెపివారు ఎక్కువ అన్యాయం చేశారని, కాంగ్రెసు కన్నా ఎక్కువ మోసం చేశారని ప్రజలు అనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విభజన హామీలను కేంద్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.

ఎపికి ఒక రూల్, ఇతర రాష్టాలకు మరో రూలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమిత్ షా, రాసిన లేఖలోని ప్రతి అంశాన్ని ఆయన శనివారం శాసనసభలో ఉటంకిస్తూ వరుసగా సమాధానం ఇస్తూ వెళ్లారు. ఇచ్చిన నిధులను వాడుకోవడం లేదని అంటున్నారని, మనలను అసమర్థులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు

అవమానకరంగా జైట్లీ మాట్లాడుతున్నారు...

అవమానకరంగా జైట్లీ మాట్లాడుతున్నారు...

జైట్లీ అవమానకరంగా మాట్లాడుతున్నారని, యుద్ధానికి వాడే నిధులను మనం అడుగుతున్నామా, ఎపి ప్రజలు అంత నీచంగా కనిపిస్తున్నారా అని చంద్రబాబు అన్నారు. విభజన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని జైట్లీ చెప్పారని, కానీ అమలు చేయలేదని ఆయన అన్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదననెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

కేంద్రానిది పూర్తిగా బాధ్యతరాహిత్యం

కేంద్రానిది పూర్తిగా బాధ్యతరాహిత్యం


ఇతర దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదగాలంటే పదేళ్లు పడుతుందని, ఎంతో కష్టపడి నిలదొక్కుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఇస్తామని చెప్పినవాటిని ఆయన ప్రస్తావిస్తూ కేంద్రం అన్యాయం చేసిందని విమర్శించారు.ఎపి పట్ల ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారని అడిగారు. ఇప్పటికీ కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని అన్నారు.

చాలా భూములు ఇచ్చాం

చాలా భూములు ఇచ్చాం

అంతర్జాతీయ విమానాశ్రయాలకు తాము విలువైన భూములు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. హైదరాబాదులో కేంద్ర సాయం లేకుండా అద్బుతమైన శంషాబాద్ విమానాశ్రయం కట్టామని చెప్పారు. విజయవాడ, అమరావతి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కేంద్రానికి భూములు ఇచ్చామని అన్నారు. పట్టింపులకు పోకూడదని తాను వ్యవహరిస్తుంటే వారు అన్యాయం చేస్తున్నారని అన్నారు.

 ప్రజల మనోభావాలను బట్టే

ప్రజల మనోభావాలను బట్టే

నాలుగేళ్లు తాము నిరీక్షించామని, 29 సార్లు తాను ఢిల్లీ వెళ్లాని చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద, రాష్ట్ర ప్రభుత్వం వద్ద లెక్కలున్నాయని, వాటిని బేరీజు వేస్తూ ఇవి చేశాం, ఇవి చేయలేదు, చేస్తామని చెప్తే బాగుండేదని అన్నారు. తాము ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి ఎన్డీఎ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలను అమిత్ షా మభ్య పెడుతున్నారని ఆయన విమర్శించారు.

మేం ఇంత ఆందోళన చేస్తుంటే

మేం ఇంత ఆందోళన చేస్తుంటే

ఇంత ఆందోళన చేస్తున్నా కూడా ఎపి కేంద్రానికి గుర్తు రావడం లేదని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొడుతున్నాయని అమిత్ షా అనడాన్ని ఆయన తప్పు పట్టారు. అన్యాయం చేశారు కాబట్టి సెంటిమెంట్ వచ్చిందని, మోసం పోతున్నామనే భావనతో ప్రజలు ఉన్నారని అన్నారు. దెబ్బ తగిలిన ప్రజల గాయాలను పట్టుకుంటే నొప్పి ఎక్కువగా ఉంటుందని, ఎపి ప్రజల పరిస్థితి అలా ఉందని అన్నారు. అవసరమైతే తెలుగు ప్రజలు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆయన చెప్పారు.

English summary
Andhra Pradesh CM Nara Chnadrababu Naidu accused that Finance minister Arun jaitley insulted AP public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X