వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలనం .. నాది ఉడుం పట్టు ,ఆయనలా కేసును మధ్యలో వదిలిపెట్టను

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : మాజీ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!! || Oneindia

ఏపీలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు అన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లా కంచర్లపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనలా కేసులను మధ్యలో వదిలిపెట్టనని చెప్పుకొచ్చారు. సీబీఐ మాజీ జేడీ, విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చెయ్యటం ఆసక్తికరంగా మారింది.

తాను పడితే ఉడుంపట్టు .. లక్ష్మీ నారాయణలా మధ్యలో విడిచిపెట్టను అన్న చంద్రబాబు

తాను పడితే ఉడుంపట్టు .. లక్ష్మీ నారాయణలా మధ్యలో విడిచిపెట్టను అన్న చంద్రబాబు

ఇక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తాను పడితే ఉడుం పట్టేనని, పట్టినపట్టు విడవనని చెప్పుకొచ్చారు. కానీ వీవీ లక్ష్మీ నారాయణ అలాకాదని , పట్టుకున్న అతి ముఖ్యమైన కేసును మధ్యలోనే విదిచిపెట్టాడని చెప్పుకొచ్చారు . జగన్, మోడీల తీరుపై ఫైర్ అయ్యారు. ఏపీని నాశనం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు .

కేసీఆర్ పై బాబు ఫైర్ .. కేంద్రం తీరుపై నిప్పులు

కేసీఆర్ పై బాబు ఫైర్ .. కేంద్రం తీరుపై నిప్పులు

కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని తెలిపారు. శ్రీశైలం, సాగర్, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు జోలికి వస్తే వదిలిపెట్టేది లేదని కేసీఆర్ ను హెచ్చరించారు. నీతివంతమైన సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. టీడీపీని ఎదుర్కోలేక కుట్రలకు తెరతీశారని ఫైర్ అయ్యారు. అధికారుల బదిలీలు, కేంద్ర సంస్థల దాడులతో నన్ను ఏమి చెయ్యలేరని నిప్పులు చెరిగారు.

మైనార్టీలకు డిప్యూటీ సీఎం, వడ్డీలేని రుణం : ఏపీ సీఎం చంద్రబాబు వరాలుమైనార్టీలకు డిప్యూటీ సీఎం, వడ్డీలేని రుణం : ఏపీ సీఎం చంద్రబాబు వరాలు

విశాఖ ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ

విశాఖ ప్రజల సమస్యలు తీరుస్తానని హామీ

ఇక విశాఖ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి సమస్యపై దృష్టి సారిస్తానని చెప్పిన చంద్రబాబు విశాఖపట్నంలో నీటి ఎద్దడి తీరుస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నంను కాస్మోపాలిటిన్ సిటీగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. సింహాచలం భూ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అర్బన్ ఏరియాలో ఉన్న పేదలందరికీ ఇళ్లుకట్టిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు విదేశీ విద్యకోసం రూ.25 లక్షల ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించే క్రమంలోనే ఆయన జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

English summary
Chandrababu participated in election campaign in Kancharlapalem of Visakhapatnam district and made sensational remarks against former CBI JD Laxminarayan. He said he did not leave the cases in the middle like Lakshmi narayana .TDP chief and Chief Minister Chandra Babu's comments on VV Lakshminarayana, a former JD created interest in the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X