వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్ పేయిని స్మరించుకున్న చంద్రబాబు-తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడంటూ ట్వీట్..

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. తన హయాంలో దేశ అభివృద్ధికి వాజ్ పేయ్ వేసిన బాటల్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి వాజ్ పేయ్ మిత్రపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవాళ ఆయన సేవల్ని స్మరించుకుంటూ ట్వీట్ చేశారు.

"ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో ముఖ్యులు శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు. ప్రధానిగా అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత వాజపేయి గారి వర్ధంతి సందర్భంగా ఆ భారతరత్న స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను." అంటూ చంద్రబాబు ఓ ట్వీట్ పెట్టారు.

chandrababu shares memories with former pm vajpayee on death anniversary-says real patriot

మరో ట్వీట్ లో చంద్రబాబు " శ్రీ వాజపేయి గారి పాలనా కాలంలో ఊపిరిపోసుకున్న టెలికాం, స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్, ఓపెన్ స్కై పాలసీ, సూక్ష్మసేద్యం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్థుల వంటి కీలక సంస్కరణల్లో ఆయనతో కలిసి పనిచేయడం... భాగస్వామి కావడం నాకు ఎంతో తృప్తిని ఇచ్చే అంశం" అన్నారు.

ఇంకో ట్వీట్ లో "దేశంలోని అభివృద్ధి చెందిన రోడ్లలో సగం వాజపేయి పాలనలో అభివృద్ధి చేసినవే. ఆ సమయంలోనే జరిగిన పోఖ్రాన్ అణు పరీక్షలు, కార్గిల్ విజయం వంటివి భారత దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ తప్పక తలచుకోవాల్సిన దేశభక్తుడు శ్రీ వాజపేయి గారు." అంటూ చంద్రబాబు స్మరించుకున్నారు.

English summary
former cm chandrababu naidu on today remembers former pm atal bihar vajpayee on his death anniversary in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X