వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! చిత్తశుద్ధి నిరూపించుకో: శైలజ, 'పత్తిపాటికి నాన్‌బెయిలబుల్ వారెంట్'

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహార శైలిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఇదే విషయంపై స్పందిస్తూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

బుధవారంతో మీడియాతో మాట్లాడిన శైలజానాథ్.. ప్రత్యేక హోదా విషయంలొ సీఎం చంద్రబాబుకు
ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రత్యక్ష పోరాటానికి దిగాలన్నారు. ఇందుకోసం పోరాట దీక్షలు చేయాలని సూచించిన ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టి చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలకు తయారవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ రెండు పార్టీలు ప్రత్యేక హోదా విషయంలో నాటకాలాడుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ఆరోపించారు.

chandrababu should prove his sincerity on special status : shailajanath

'మంత్రి ప్రత్తిపాటికి నాన్ బెయిలబుల్ వారెంట్'

విజయవాడ : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది రైల్వే కోర్టు. సమైఖ్యాంధ్ర ఉద్యమ సమయంలో ఆయనపై కేసులు నమోదు కాగా, కోర్టు వాయిదాలకు ఆయన గైర్హాజరవుతూ వస్తుండడంతో తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది కోర్టు.

సమైఖ్యాంధ్ర ఉద్యమం సందర్భంగా నిర్వహించిన రైల్ రోకోలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై అప్పట్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యే ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యేలు జియావుద్దీన్, లింగంశెట్టి ఈశ్వర్రావు, వైఎస్సార్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి కేసులో నిందితులుగా ఉన్నారు.

కాగా, ఈ కేసు రైల్వే కోర్టు పరిధిలో ఉండగా.. విచారణకు నిందితులంతా గైర్హాజరవుతున్నారు. దీంతో కేసులో నిందితులందరికీ నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది కోర్టు. కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

English summary
congress leader shailajanath made some suggestions to chandrababu on special status issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X