వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: 'బాబూ! అది ఆపు, హోదా ఉద్యమంపై సీఎం ఆంక్షలు, తిట్టుకుంటున్నారు'

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం జపాన్ తరహా ఉద్యమించాలని చంద్రబాబు చెబుతారని, కానీ అక్కడ అవినీతికి పాల్పడితే ఉరితీస్తారని, అవినీతి మంత్రులను జైల్లో కూడా పెట్టారని చెప్పారు.

వాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లివాడెవడో తిట్టాడని.. పనికిరానిది? నేనైతే ఇలా: విజయసాయి అంశంపై బాబుకు ఉండవల్లి

మరి ఇక్కడ అవినీతి చేసిన వారిని జైల్లో పెడతారా ని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు జపాన్, సింగపూర్ లాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఆయన మాటలు మానివేసి, చేతలు మొదలు పెట్టాలన్నారు. ఏపీకి హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.

 షాకింగ్.. హోదా ఉద్యమంపై బాబు ఆంక్షలు

షాకింగ్.. హోదా ఉద్యమంపై బాబు ఆంక్షలు

ప్రత్యేక హోదా ఉద్యమాలపై చంద్రబాబు నాయుడు ఆంక్షలు విధిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, ఉద్యమాలు చేసే వారి మాయలో పడవద్దని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు పిలుపునిస్తున్నారని వ్యాఖ్యానించారు. హోదా ఉద్యమం విషయంలో చంద్రబాబుకు క్లారిటీ లేదని అభిప్రాయపడ్డారు.

 అరగంట పాటు బ్లాక్ డే

అరగంట పాటు బ్లాక్ డే

ఏప్రిల్ 1వ తేదీన విద్యార్థి జేఏసీ తలపెట్టిన ఆందోళనకు తాము మద్దతిస్తున్నట్లు రామకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ డేగా పాటిస్తామని చెప్పారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 అవిశ్వాసం నోటీసు ఇచ్చినా

అవిశ్వాసం నోటీసు ఇచ్చినా

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై పలు రాజకీయ పార్టీలు నోటీసులు ఇచ్చినా ఆ అంశాన్ని ఇంతవరకు చర్చకు రానీయడం లేదని మండిపడ్డారు.

 పార్లమెంటు వద్దే తిట్టుకుంటున్నారు

పార్లమెంటు వద్దే తిట్టుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలోనే ఒకరిని ఒకరు తిట్టుకుంటూ దిగజారిపోతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. తెలుగుదేశం, వైసీపీ ఎంపీలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నా కేంద్రానికి వినిపించడం లేదన్నారు.

English summary
CPI Ramakrishna on Thursday said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu should stop talking about Japan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X